సందీప్ కిషన్ సినిమాకి సూపర్ టైటిల్!

  • November 18, 2017 / 07:44 AM IST

తెలుగులో సరైన విజయం లేకపోయినా తమిళనాట వరుస అవకాశాలు దక్కించుకుంటూ తన ఉనికిని చాటుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న సందీప్ కిషన్ తాజా చిత్రం “కేరాఫ్ సూర్య” ఫ్లాప్ అవ్వడమే కాక కనీస స్థాయి కలెక్షన్స్ దక్కించుకోలేక సందీప్ కిషన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అయితే.. హీరోగా కంటే ప్రధాన పాత్రలు పోషించడానికి ఈమధ్య ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్న సందీప్ కిషన్ “డి 16” సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో సందీప్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. నిజానికి ఈ చిత్రంలో తొలుత నాగచైతన్య నటించాల్సి ఉండగా.. పెళ్లి బిజీ కారణంగా డేట్స్ ఎడ్జస్ట్ చేయలేకపోవడం వలన ఆ అవకాశాన్ని సందీప్ కిషన్ సొంతం చేసుకొన్నాడు. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సందీప్ నటిస్తుండడంతో తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ లో విడుదల చేయనున్నారు.

తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “నరగాసురన్” అనే టైటిల్ ను నిర్ణయించగా.. తెలుగులో “నరకాసురుడు” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. “మీసయ్య మురుక్కు” అనే తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయమైన ఆత్మిక ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అరవిందస్వామి కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడని వినికిడి. వెరీ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం కార్తీక్ నరేన్ మునుపటి చిత్రం “డి 16” కంటే పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు రషెస్ చూసినవాళ్ళంతా. ఒకవేళ ఈ సినిమా గనుక హిట్ అయితే సందీప్ సినిమా కష్టాలు తీరినట్లే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus