Sunil, Rajasekhar: హీరో రాజశేఖర్ గురించి సునీల్ ఎమోషనల్ కామెంట్స్..!
November 12, 2021 / 05:18 PM IST
|Follow Us
ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ గా ఇప్పుడు యాంగ్రీ స్టార్ గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు రాజశేఖర్. గతంలో ఆయన ఎన్నో యాక్షన్ సినిమాల్లో.. ఎమోషనల్ సినిమాల్లో.. ఫ్యామిలీ సినిమాల్లో హీరోగా నటించి స్టార్ డం ను సంపాదించుకున్నారు. ఇప్పటికీ కుర్రహీరోల డామినేషన్ ను తట్టుకుని మరీ సినిమాలు చేస్తున్నారు. ఈ దశలో పి.ఎస్.వి.గరుడ వేగ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. రాజశేఖర్ కూతుర్లు కూడా సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక జీవిత కూడా మా అసోసియేషన్లో మెంబర్ గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. రాజశేఖర్ నటుడే కాదు నిజజీవితంలో డాక్టర్ కూడా.. అన్న సంగతి తెలిసిందే. ఈయన హస్తవాసి మంచిదని ఎంతో మంది నటీనటులు ఈయనతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. గతంలో హీరో సునీల్ కూతురికి కూడా వైద్యం అందించి బ్రతికించారట రాజశేఖర్. ఓసారి సునీల్ కూతురు తీవ్ర అనారోగ్యం పాలైతే.. ఎంతో మంది అనుభవం ఉన్న డాక్టర్లు కష్టం అని చెప్పేసినా…
రాజశేఖర్ గారు ట్రీట్మెంట్ తన పాపని బ్రతికించినట్టు సునీల్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా రాజశేఖర్ సినిమాలకి అభిమానిని అని తెలిపిన సునీల్.. తన కూతురి ప్రాణాలను కాపాడిన దేవుడిగా రాజశేఖర్ ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని సునీల్ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల పరంగా సునీల్..ప్రస్తుతం విలన్ రోల్స్ చేస్తూనే మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.