Sunil: ఒకప్పటి సునిల్‌ను మళ్లీ మనం చూస్తామా

  • May 7, 2021 / 02:44 PM IST

సునిల్‌ హీరో నుండి కమెడియన్‌ అయిపోయాడు అనుకుంటుడగా మళ్లీ హీరోగా సినిమా చేస్తున్నాడని సమాచారం. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుకంర్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారట. అయితే ఈ సినిమాతోనే సునిల్‌ హీరోయిజం ఆగిపోవడం లేదట. ఈ కాంబినేషన్‌లోనే మరో సినిమా కూడా ఉండబోతోందని టాలీవుడ్‌ వర్గాల టాక్‌. ఇటీవల కోలీవుడ్‌ విడుదలై మంచి విజయం అందుకున్న ఓ కామెడీ సినిమాను సునిల్‌ ప్రధాన పాత్రలో రూపొందిస్తారని సమాచారం. తమిళ ఇండస్ట్రీలో సెటైరికల్‌ కామెడీ ఎక్కువగా ఉంటుంది.

పాలిటిక్స్‌ మీద అలా వచ్చిన చిత్రం ‘మండేలా’. యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన ఆ సినిమా రీమేక్‌ హక్కుల్ని అనిల్‌ సుంకర్‌ దక్కించుకున్నారట. దానినే ఇప్పుడు సునిల్‌ హీరోగా తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. కొత్త దర్శకుడు ఈ సినిమా కోసం మోగా ఫోన్‌ పట్టుకుండాట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అప్పుడు మరిన్ని వివరాలు బయటికొస్తాయి. రాజకీయ వ్యంగ్య చిత్రంగా రూపొందిన ‘మండేలా’లో గ్రామ రాజకీయాలను ప్రస్తావించారు.

ఓ గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామంలోని ప్రజలంతా రెండు వర్గాలుగా విడిపోతారు. దీంతో మండేలా అనే బార్బర్ ఓటు నిర్ణయాత్మకంగా మారుతుంది. మండేలా ఓటు కోసం ఇరు వర్గాలు కుయుక్తులు పన్నడం, దాని కోసం వారు చేసే పనులు లాంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల ఈ సినిమాను తమిళనాట స్టార్ విజయ్ టీవీ డైరెక్టుగా విడుదల చేసింది. దాంతోపాటు నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. రెండు చోట్లా మంచి స్పందన వస్తోంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus