సునీల్‌, కె.క్రాంతి మాద‌వ్ కాంబినేష‌న్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-8 పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం

  • March 28, 2016 / 07:55 AM IST

గోల్డేన్ స్టార్ సునీల్‌, కె.క్రాంతి మాద‌వ్ కాంబినేష‌న్ లో యూనిటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్ ప్రోడ‌క్ష‌న్ నెం-8 పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకొని, కథానాయకుడిగా వరుస విజయాలు అందుకుంటున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో టేస్ట్ వున్న మంచి ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో, వ‌రుస స‌క్స‌స్‌లు అందింస్తు లేటెస్ట్ గా పండ‌గ‌చేస్కో అనే సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రం త‌రువాత‌ మంచి క‌థ‌ల కోసం కొంత‌ గ్యాప్ తీసుకున్న ప‌రుచూరి కిరీటి నిర్మాత‌గా, యునిటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్ బ్యాన‌ర్ లో ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ ప్రోడ‌క్ష‌న్ నెం-8 గా నిర్మిస్తున్న చిత్రం ఈరోజు ఫిల్మ్‌న‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో ప‌లువురు సినీప్ర‌ముఖుల స‌మ‌క్షంలో పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రాంభ‌మైంది. ఈ చిత్రం ద్వారా త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో 25 చిత్రాల‌కు పైగా న‌టించిన బిజియ‌స్ట్ హీరోయిన్ మియ న‌టిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి క్రేజి ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌, టాలీవుడ్‌ క్రేజి నిర్మాత‌లు దిల్‌రాజు, సురేష్‌బాబు, ఠాగూర్ మ‌దు, దామెద‌ర‌ప్ర‌సాద్‌, ర‌మేష్‌ప్ర‌సాద్‌, రాజీవ్‌రెడ్డి మ‌రియు చిత్ర న‌టీన‌టులు , సాంకేతిక నిపుణులు హ‌జ‌ర‌య్యారు. దేవుని ప‌టాల‌పై పూజ‌చేసిన స్ర్కిప్ట్ ని ర‌మేష్ ప్ర‌సాద్ గారు నిర్మాత‌ల‌ని అందించారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు గారు కెమెరా స్కిచ్ ఆన్ చేయ‌గా, హీరో సునిల్‌, హీరోయిన్ మియ పై డి.సురేష్ బాబు గారు క్లాప్ కొట్టారు. ఫ‌స్ట్ షాట్ డైర‌క్ష‌న్ ని చిత్ర ద‌ర్శ‌కుడు క్రాంతి మాద‌వ్ అందించారు.

టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ డైన‌మిక్ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ గారు మాట్లాడుతూ.. క్రాంతి మాద‌వ్ అందించిన రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న చిత్రాలే. త‌న‌కి క‌థ‌ల‌పై మంచి టేస్ట్ వుంది. ఈ చిత్రం కూడా త‌ప్ప‌కుండా అంద‌రి మ‌న‌సులు గెలుస్తుంది. సునీల్ కూడా మంచి చిత్రాలు ఎంచుకుని మ‌రి ముందుకు వెలుతున్నాడు. ఈచిత్రం మంచి విజ‌య‌న్ని సాధించాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాత దామెద‌ర ప్ర‌సాద్ గారు మాట్లాడుతూ.. నిర్మాత నాకు చాలా కావ‌ల‌సిన మ‌నిషి. డేర్ తో చిత్రాలు తీయ‌టం ఆయ‌న‌కే చెల్లింది. క్రాంతి మాద‌వ్ తీసిన రెండు చిత్రాలు నాకు చాలా న‌చ్చిన చిత్రాలు. సునీల్ చేసే ప్ర‌తి చిత్రాన్ని ఎంజాయ్ చేస్తూ వుంటాను. త‌ప్ప‌కుండా వీరి కాంబినేష‌న్ సూప‌ర్‌హిట్ అవ్వాల‌ని కొరుకుంటున్నాను.

నిర్మాత ప‌రుచూరి కిరీటి మాట్లాడుతూ.. రెండు నెల‌ల నుండి ఈచిత్ర స్క్రీప్ట్ ఫుల్ గా డిస్క‌ష‌న్ చేస్తున్నాము. ఆల్‌రెడి డైర‌క్ట‌ర్ క్రాంతి గారు బౌండ‌డ్ స్క్రీప్ట్ తో వున్నారు. ఏప్రిల్ లో ఈచిత్రం సెట్స్ మీద‌కి వెలుతుంది. అవుట్ అండ్ అవుట్ కామెడి చిత్రంగా తెర‌కెక్కుతుంది. త‌ప్ప‌కుండా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. మాట‌ల ర‌చ‌యిత చంద్ర‌మెహ‌న్ చింతాడ మాట్లాడుతూ.. న‌న్ను న‌మ్మి ఇంత మంచి చిత్రంలో నాకు ర‌చ‌యిత‌గా అవ‌కాశం ఇచ్చినందుకు చిత్ర నిర్మాత‌కి, హీరోకి, ద‌ర్శ‌కుడుకి నా ధ‌న్య‌వాదాలు..

ద‌ర్శ‌కుడు క్రాంతి మాద‌వ్ మాట్ల‌డుతూ.. నా రెండు చిత్రాలు రెండు ర‌కాల జోన‌ర్ లో చేశాను. ఇప్పుడు ఈ చిత్రం కామెడి యాంగిల్ చేస్తున్నాను. నేను క‌థ రాసుకున్న త‌రువాత హీరో సునీల్ ద‌గ్గ‌ర‌కి వెళ్ళాను. ఆయ‌న‌కి చాలా బాగా న‌చ్చింది. త‌ప్ప‌కుండా మా ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఎలాంటి చిత్రం వ‌స్తుంద‌ని అనుకుంటారో అదే వ‌స్తుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. చంద్ర‌మెహ‌న్ మాట‌లు అందిస్తున్నాడు. నిర్మాత ప‌రుచూరి కిరిటి కి ఈ క‌థ చాలా అంటే చాలా బాగా న‌చ్చింది. ఏప్రిల్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ చేస్తున్నాము. హ‌రోయిన్ మియా త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో 25 చిత్రాలు చేసంది. బిజిగా వున్నా మా స్టోరి న‌చ్చి చేస్తుంది.

హీరోయిన్ మియ మాట్ల‌డుతూ.. నేను 25 చిత్రాల్లో న‌టించాను. తెలుగులో నా మెద‌టి ఫిల్మ్‌. చాలా హ్యిపిగా వుంది. థ్యాంక్స్ టు ఆల్‌..

హీరో సునీల్ మాట్లాడుతూ.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రం నాకు నచ్చిన మంచి చిత్రాల్లో ఒకటి. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన క్రాంతి మాధవ్ మరో మంచి కథను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. అన్ని వర్గాల్ని దృష్టిలో ఉంచుకొని క్రాంతి మాధవ్ కథను తయారు చేశారు. నా క్యారెక్టరేజేషన్ ను విభిన్నంగా మలిచారు. భారీ చిత్రాల్ని నిర్మించిన పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ద‌ర్శ‌కుడు విజ‌య్‌భాస్క‌ర్‌, త్రివిక్ర‌మ్ లు ఎలా అయితే ఫుల్‌ప్టెడ్జ్‌డ్ గా బౌండ‌డ్ స్ర్కిప్ట్ తో షూట్ కి వెలతారో.. ఈ చిత్రం కూడా అంతే డైలాగ్ వెర్ష‌న్ కూడా రెడి చేసి షూట్ కి వెలుతున్నాము. క్రాంతి గారు మ‌రో స‌క్స‌స్ అందుకుంటారు. అని అన్నారు.

న‌టిన‌టులు..సునీల్‌, మియ (ప‌రిచ‌యం), సంప‌త్‌, ఆలి, ఆశిష్ విద్యార్ధి, వెన్నెల కిషోర్‌, పృద్వి, దువ్వాసి మెహ‌న్‌, త‌దిత‌రులు న‌టించ‌గా.. సంగీత ద‌ర్శ‌కుడు.. జిబ్రాన్, ఆర్ట్‌.. ఏ.య‌స్‌.ప్ర‌కాష్‌, ఎడిట‌ర్.. కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, పి.ఆర్‌.ఓ- ఎస్‌.కెన్‌& ఏలూరు శ్రీను , మాట‌లు.. చంద్ర‌మెహ‌న్ చింతాడ‌, నిర్మాత‌.. ప‌రుచూరి కిరిటి, స్టోరి-స్క్రీన్‌ప్లే-డైర‌క్ష‌న్‌.. కె.క్రాంతి మాద‌వ్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus