హీరోగా మరో ఛాన్స్ పట్టేశాడా..?

  • December 24, 2020 / 04:04 PM IST

టాలీవుడ్ లో కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన సునీల్.. హీరోగా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో ఆయన నటించిన ‘అందాల రాముడు’, ‘మర్యాద రామన్న’ సినిమా మంచి సక్సెస్ ను అందుకున్నాయి. కానీ ఆ సక్సెస్ ను ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయాడు. వరుసగా ప్లాప్ లు రావడంతో డీలా పడ్డాడు. కండలు పెంచి, ఎన్ని డాన్స్ లు చేసినా.. వర్కవుట్ అవ్వలేదు. దీంతో హీరోగా అవకాశాలు రాక..

కమెడియన్ గా సినిమాలు చేయలేక రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది అతడి పరిస్థితి.కమెడియన్ గా కొన్ని అవకాశాలు వచ్చినా.. సునీల్ ని ఆ పాత్రల్లో చూడలేకపోయారు జనాలు. దీంతో నెగెటివ్ రోల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ‘కలర్ ఫోటో’ అతడికి మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి సునీల్ హీరోగా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కన్నడలో సక్సెస్ అయిన ‘బెల్ బాటమ్’ సినిమాను సునీల్ హీరోగా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఓ నిర్మాత ఈ సినిమా హక్కులు తీసుకొని దర్శకుడి కోసం చూస్తున్నాడట. సినిమా హీరో పాత్ర లుక్ ప్రకారం సునీల్ అయితే ఈ సినిమాకు బాగుంటుందని భావిస్తున్నారట. సునీల్ కూడా ఈ సినిమాలో నటించడం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారట. అయితే ఇప్పటికే ‘బెల్ బాటమ్’ సినిమాను తెలుగులోకి డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. వింటేజ్ డిటెక్టివ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకెక్కించారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus