అజ్ఞాతవాసి సినిమాలో ఛాన్స్ సునీల్ ఎందుకు వదులుకున్నారంటే ?

  • December 29, 2017 / 06:16 AM IST

తెలుగు సినీ అభిమానులు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మొదటి స్థానంలో ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ క్రేజ్ నెలకొని ఉంది. కుష్బూ, వెంకటేష్ వంటి స్టార్ నటీనటులు నటించిన ఈ మూవీ జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సునీల్ కి త్రివిక్రమ్ మంచి రోల్ ఇచ్చారు. కానీ అతను నో చెప్పారు. ఈ విషయంపై కొంతకాలంగా యూట్యూబ్ లో అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై ఇన్నాళ్లకు సునీల్ స్పందించారు. ఆయన శంకర్ దర్శకత్వంలో నటించిన “2 కంట్రీస్” మూవీ నేడు రిలీజ్ అయింది.

ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన సునీల్ మంచి ఛాన్స్ ని ఎందుకు వదులుకున్నారో చెప్పారు. “త్రివిక్రమ్ నాకు ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే. దాన్ని తిరస్కరించిన సంగతి కూడా నిజమే. అయితే నాకు క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు అది పూర్తిగా రెడీ కాలేదు. అందుకే నో చెప్పాను” అని వివరించారు. మహాలక్ష్మీ ఆర్ట్స్‌ పతాకం పై ఎన్‌. శంకర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 2 కంట్రీస్ పై సునీల్ అసలు పెట్టుకున్నారు. ఈ మూవీని చాలా రిచ్‌గా తీశామని, అమెరికాలో 45 డేస్‌ షెడ్యూల్‌ జరిపామని డైరక్టర్ అన్నారు. ఈ మూవీ సునీల్ కెరీర్ కి ఆక్సిజన్ అవుతుందని ధీమాగా చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus