సునీల్ కి బడా షాక్ ఇచ్చిన దర్శకనిర్మాతలు!

  • October 3, 2017 / 11:51 AM IST

టాలీవుడ్ లో కమీడియన్ గా మంచి మార్కులు వేయించుకునే క్రమంలో రాజమౌళి పుణ్యమా అని హీర్ అవతారం ఎత్తిన స్టార్ కమీడియన్ సునీల్ హీరో అనే పాత్ర చాలా బరువైనది అని తెలిసినా, కష్టపడుతూనే మోస్తున్నాడు…అయితే కాలం కలసి రావడంలేదో, లేక తాను ఎంకుకున్న మార్గం మంచి కాదో తెలీదు కానీ, మొత్తంగా చూసుకుంటే మాత్రం సునీల్ హీరోగా ఫెయిల్ అయ్యాడు అనే చెప్పాలి…అసలు మ్యాటర్ ఏంటి అంటే…కమెడియన్ గా స్టార్ క్రేజ్ దక్కించుకున్న సునీల్ హీరోగా టర్న్ తీసుకున్నాక మొదట్లో పర్వాలేదు అనిపించాడు..కానీ… తర్వాత తర్వాత డల్ అయిపోయాడు. సునీల్ సినిమా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్లింది తెలియని పరిస్థితి అయ్యిందంటే నమ్మాలి. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాల తర్వాత సునీల్ తో క్రాంతి మాధవ్ తో ఉంగరాల రాంబాబు చేసిన సునీల్…ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు…కానీ ఆ సినిమా ఫలితం కూడా నిరాశ పరచడంతో చాలా డిస్ట్రబ్ అయ్యాడట.

ఇక అదే క్రమంలో ఆ ఇంప్యాక్ట్ సునీల్ కరియర్ పై పండింది, అదేలా అంటే…ఉంగరాల రాంబాబు సినిమా డిజాస్టర్ అవడం వల్ల ఇప్పుడు సునీల్ కొత్త సినిమా ఆగిపోయిందట. సునీల్ హీరోగా జెంటిల్మన్ దర్శకుడు శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో తమిళ సూపర్ హిట్ మూవీ చతురంగ వేట్టై సినిమా రీమేక్ చేయాల్సి ఉంది. గోపికృష్ణ డైరక్షన్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. కాని ప్రస్తుతం సునీల్ తో సినిమా తీసి రిస్క్ లో పడటం ఎందుకని ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారట దర్శక నిర్మాతలు. అదిగాక చతురంగ వేట్టై సినిమా థ్రిల్లర్ కథాంశంతో సాగుతుంది. ఆ సినిమా కు సునీల్ కామెడీ జానర్ కు పొంతన కుదరదనే అభిప్రాయంతో సినిమా సునీల్ తో కాదనుకున్నారట. ఇక అదే కాకుండా సునీల్ మార్కెట్ బాగా డల్ అవడం వల్ల కూడా ఈ సినిమా చేజారింది అన్నది టాక్. మొత్తంగా చూసుకుంటే ఈ పరిణామాల ఫలితంగానే సునీల్ మళ్లీ కమీడియన్ అవతారం ఎత్తెందుకు సిద్దం అవుతున్నాడు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది…చూద్దాం మరి ఏమవుతుందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus