సన్నీ వచ్చింది ప్రెస్ మీట్ కోసమా!

  • October 28, 2017 / 06:10 PM IST

అసలు సన్నీలియోన్ ను ఆన్ లైన్ లో చూడడం తప్ప డైరెక్ట్ గా చూసి ఎరుగరు చాలామంది. అలాంటి సన్నీలియోన్ “నేను వస్తున్నా మీకోసం, మాంచి డ్యాన్స్ పెర్ఫ్మార్నెస్ కూడా చేస్తాను” అంటూ రెండ్రోజుల ముందే వీడియో మెసేజ్ కూడా ఇవ్వడంతో మన హైదరాబాదీ కుర్రాళ్ళందరూ ఎంతో ఆశగా ఎప్పుడెప్పుడు అక్టోబర్ 27 వస్తుందా అని ఆశగా ఎదురుచూశారు. రాజశేఖర్ హీరోగా రూపొందిన “గరుడ వేగ” సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైద్రాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరిగింది. ఇప్పటివరకూ ఏ రాజశేఖర్ సినిమాకి హాజరవ్వని స్థాయిలో జనాలు వచ్చారు.

కట్ చేస్తే.. సన్నీలియోన్ ఎప్పట్లానే అందంగా రెడీ అయ్యి ఈవెంట్ కి హాజరయ్యింది కానీ చాలా సైలెంట్ గా రెగ్యులర్ హీరోయిన్స్ వచ్చినట్లు వచ్చి.. కొన్ని నవ్వులు, ఇంకొన్ని హొయలు ఒలకబోసి చాలా సైలెంట్ గా చెక్కేసింది. దాంతో సన్నీ ఏదో పెర్ఫార్మ్ చేసేస్తుందని ఊహించుకొని ఈవెంట్ కి వచ్చినవాళ్ళందరూ తీవ్రంగా నిరాశచెందారు. సో, సన్నీ అందాలు చూసి తరించాలంటే నవంబర్ 3 వరకూ ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus