Sunny Leone: సన్నీ పాన్ కార్డుతో మోసం.. ఎలా మోసపోయారంటే?
February 18, 2022 / 05:08 PM IST
|Follow Us
ఈ మధ్య కాలంలో కొంతమంది సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మోసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా మోసపోతున్న వారి జాబితాలో సెలబ్రిటీలు ఉండటం గమనార్హం. శృంగారతారగా పాపులారిటీని సంపాదించుకున్న సన్నీ లియోన్ గుర్తు తెలియని వ్యక్తులు తన పాన్ కార్డును ఉపయోగించిన్ లోన్ తీసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు తెలియకుండా ఈ రుణం మంజూరైందని ఆమె చెప్పుకొచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు తన పాన్ కార్డును దుర్వినియోగం చేసి 2,000 రూపాయల లోన్ తీసుకుని ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఆ ప్రభావం సిబిల్ స్కోర్ పై పడిందని సన్నీ లియోన్ చెప్పుకొచ్చారు.
సామాన్యులు కూడా ఈ తరహా మోసాల బారిన పడుతున్నా కొన్ని సందర్భాల్లో మాత్రమే వారికి న్యాయం జరుగుతుండటం గమనార్హం. మొదట చేసిన ట్వీట్ ను కొంత సమయం తర్వాత సన్నీ లియోన్ డిలీట్ చేశారు. ఆ తర్వాత సమస్యకు పరిష్కారం లభించిందని థ్యాంక్స్ చెబుతూ సన్నీ లియోన్ మరో ట్వీట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పాన్ కార్డుకు సంబంధించిన సమాచారాన్ని అనవసరమైన వ్యక్తులకు వెల్లడించకుండా ఉండటం ద్వారా ఇలాంటి మోసాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
మోసగాళ్లు సెలబ్రిటీల పాన్ నంబర్లను సేకరించి ఆధార్ కార్డ్, ఇతర వివరాలలో అడ్రస్ లను మార్చి ఈ రుణాలను తీసుకుంటున్నారు. లోన్ ను మంజూరు చేసే సంస్థలు సిబిల్ స్కోర్ బాగుంటే పూర్తిస్థాయిలో తనిఖీ చేయకుండా రుణాలను ఇస్తున్నాయి. ఇన్ స్టంట్ లోన్ యాప్స్ ఈ తరహా మోసాలపై దృష్టి పెట్టకపోతే భారీ మొత్తంలో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సామాన్య ప్రజలు సైతం అప్పుడప్పుడూ క్రెడిట్ రిపోర్ట్ ను పరిశీలించుకోవడం ద్వారా ఈ తరహా మోసాల నుంచి రక్షించుకునే ఛాన్స్ ఉంటుంది.