విశేషంగా ఆకట్టుకుంటున్న ‘లై’ టీజర్!

  • July 12, 2017 / 08:01 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీ లో యువ హీరోల్లో నితిన్ ఒకడు…కరియర్ స్టార్ట్ చేసి వరుస సినిమాలు చేస్తూ మంచి హీరోగా పేరు తెచ్చుకున్న నితిన్ ఆ మధ్య వరుస డిజాస్టెర్స్ తో కాస్త ఇబ్బంది పడినప్పటికీ ఈ మధ్యే వరుస హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్నాడు. అయితే కాస్త గ్యాప్ తరువాత మంచి ఫీల్ ఉన్న మూవీని ప్రేక్షకులకు అందించాలి అన్న ఆలోచనతో మన ముందుకు వస్తున్న నితిన్ “లై” అంటూ ఒక డిఫరెంట్ టైటిల్ తో దూసుకొస్తున్నాడు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ మధ్య టైటిల్ తోనే ఆసక్తిని రేపిన ‘లై’ చిత్ర బృందం తమ టీజర్ తో కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. అసలు మ్యాటర్ ఏమిటి అంటే…నితిన్ హీరోగా డైరెక్టర్ హను రాఘాపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టింది. లై అంటే అబద్ధం , అలాంటి ఇంటరెస్టింగ్ టైటిల్ పెట్టడం తోనే ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది. అందాలా రాక్షసి – కృష్ణ గాడి వీర ప్రేమ గాధ లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ హను క్లాసి టచ్ తో అలానాటి యాక్షన్ హీరో అర్జున్ ని విలన్ గా చూపిస్తూ ఈ సినిమా తీసాడు.

ఆగస్ట్ 11 న సినిమా విడుదల కి సిద్దం అవుతూ ఉండగా ప్రమోషన్ లు నిన్నటితో మొదలు పెట్టారు. నితిన్ పాత్ర ఎంత కీల‌క‌మో.. అర్జున్ పాత్ర కూడా అంతే బ‌లంగా ఉంటుంద‌న్న సంగ‌తి లై టీజ‌ర్ తో అర్థ‌మైంది. అయితే టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం…ఈ సినిమా ఒక డిఫరెంట్ స్టోరీ అని…ఎందుకంటే అబద్ధం అనేది లేకుండా జీవితం ఉండదు అనీ , కురుక్షేత్ర సంగ్రామం కూడా అబద్ధం లేకుండా జరగలేదు అనీ అలాంటిది జీవితం లో అత్యంత ముఖ్యమైన ఘట్టాలకి అబద్ధం చాలా కీలకం అనే సరికొత్త కధనం తో ఈ సినిమా తెరకెక్కింది అని టాక్. మరి చూద్దాం ఏం జరుగుతుందో..ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus