Superstar Krishna: కన్నీళ్లు పెట్టిస్తున్న సూపర్ స్టార్ కృష్ణ చివరి ఫోటో!

  • November 15, 2022 / 07:53 PM IST

సూపర్ స్టార్ కృష్ణ గారి మరణవార్తతో టాలీవుడ్ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా మహేష్ బాబు కుటుంబం అంతా విషాదంలో కూరుకుపోయింది అనే చెప్పాలి. కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణ నివాసానికి వెళ్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు ఉదయం నుండి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కృష్ణగారికి గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

వైద్యులు కీమోథెరపీ చేసినప్పుడు కృష్ణ గారు కోలుకుంటారు అని అనుకున్నారు. ట్రీట్మెంట్ కు ఆయన రెస్పాండ్ అవ్వడమే అందుకు కారణం. అయితే ఆయన మిగిలిన అవయవాలు కూడా డామేజ్ అవ్వడంతో… వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన్ని కాపాడలేకపోయారు. నవంబర్ 15 తెల్లవారుజామున కృష్ణ గారు మరణించడం జరిగింది. అయితే కృష్ణ గారు హాస్పిటల్ లో చేరినప్పుడు తీసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఫోటోలో కృష్ణగారికి సెలైన్ బాటిల్ పెట్టినట్టు స్పష్టమవుతుంది. ఇది ఆయన చివరి ఫోటో అని అంటున్నారు. హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాక కూడా కుటుంబ సభ్యులతో కృష్ణ గారు మాట్లాడటం జరిగింది. తర్వాత సీరియస్ అవ్వడంతో ఐసీయూ కి షిఫ్ట్ చేసినట్టు భోగట్టా. 8 మంది కార్డియాలజిస్ట్ లు ఆయనకు వైద్యం చేసినా ఫలితం దక్కలేదని తెలుస్తుంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి కృష్ణ గారి లాస్ట్ ఫోటోని మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus