Nani Movie: 20 ఏళ్ళ ‘నాని’ సినిమా గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయం..!
May 15, 2024 / 10:01 AM IST
|Follow Us
ప్రయోగాత్మక సినిమాలు చేయడం స్టార్ హీరోలకి ఎప్పుడూ ఓ ఛాలెంజ్. ఈ విషయం దివంగత సూపర్ స్టార్ కృష్ణకి (Krishna) బాగా తెలుసు.ఆయన ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించారు. కాబట్టి.. మహేష్ బాబు (Mahesh Babu) చేసే ప్రతి ప్రాజెక్టు విషయంలో ఆయనకు ఒక క్లారిటీ ఉండేది. ఏ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది? హిట్ అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది? అనేది ఆయన పర్ఫెక్ట్ గా అంచనా వేసి చెప్పేసేవారు. ‘ఒక్కడు’ (Okkadu) సినిమాతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న మహేష్ బాబు నుండి ఆ తర్వాత ‘నిజం’ (Nijam) ‘నాని’ (Naani) సినిమాలు వచ్చాయి.
‘నిజం’ … ‘ఒక్కడు’ కంటే ముందుగా రిలీజ్ కావాల్సిన సినిమా. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు డిలే అయ్యింది. ‘ఒక్కడు’ కి ముందు వచ్చి ఉంటే కచ్చితంగా దాని ఫలితం ఇంకోలా ఉండేదేమో. కానీ ‘నాని’ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఒక రకంగా ‘ఒక్కడు’ తర్వాత మహేష్ ఒప్పుకున్న ప్రాజెక్టు ఇదే. తన అక్క మంజుల ఈ చిత్రాన్ని నిర్మించారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన మూవీ ఇది. ‘ఖుషి’ (Kushi) తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఎస్.జె.సూర్య (SJ Surya) దర్శకుడు.
2004 మే 9న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రిలీజ్ రోజున ఈ సినిమా చూశాక కృష్ణ .. మహేష్ తో ఈ విధంగా అన్నారట. ‘నాని సినిమా కనుక హిట్ అయితే మహేష్ స్టార్ కాదు. ఇది ఆడకపోతేనే మహేష్ స్టార్ అయినట్టు’ అని అన్నారట. ఆ తర్వాత ‘నాని’ సినిమా ఆడలేదు. దీంతో మహేష్ కి కృష్ణ చెప్పిన మాట బాగా అర్ధమైందట.
‘స్టార్ హీరోలు ప్రయోగాత్మక సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరించరు’ అనే క్లారిటీ వచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. అయితే ఇదే కథని దర్శకుడు ఎస్.జె.సూర్య తమిళ్ లో ‘న్యూ’ పేరుతో చేశాడు. అక్కడ మాత్రం ఇది బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ‘నాని’ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 20 ఏళ్లు పూర్తి కావస్తోంది.