Superstar Krishna: కృష్ణ డైరెక్ట్ చేసిన చివరి హిందీ సినిమా ఏదో తెలుసా..!

  • November 15, 2022 / 08:36 PM IST

నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక లెజెండ్.. సినిమా కోసం ఆయన చేసిన సాహసాలు, ప్రయోగాలు ఓ చరిత్ర.. తెలుగులో తొలి ఫుల్ స్కోప్ సినిమా, తొలి కౌబాయ్ సినిమా, తొలి జేమ్స్ బాండ్ సినిమా, తొలి 70 ఎం.ఎం, ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ వంటి పలు కొత్త జానర్‌లను పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్‌ది.. అందుకే ఆయణ్ణి సాహసానికి మారుపేరుగా చెప్తారు..

నటుడిగా, స్టూడియో అధినేతగానే కాకుండా, నిర్మాత, రచన, దర్శకత్వం, ఎడిటింగ్ వంటి బాధ్యతలు కూడా నిర్వర్తించిన బహుముఖ ప్రజ్ణాశాలి ఆయన. కృష్ణ దర్శకుడిగా 16 చిత్రాలు చేశారు. చివరిగా (సింహాసనం తర్వాత) ఓ తెలుగు సినిమాని హిందీలో రీమేక్ చేయడం విశేషం.. సూపర్ స్టార్ కట్, యాక్షన్ చెప్పిన మూవీస్ ఏంటో చూద్దాం..

1) సింహాసనం..

కృష్ణ దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ ‘సింహాసనం’.. తొలి తెలుగు 70 ఎం.ఎం. మూవీ కూడా ఇదే కావడం విశేషం.. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ మీద కృష్ణ నటించడంతో పాటు స్టోరీ, స్క్రీన్‌‌ప్లే, డైలాగ్స్, ఎడిటింగ్ చేశారు.. సరికొత్త రికార్డులు నెలకొల్పింది ఈ చిత్రం..

2) సింగాసన్..

‘సింహాసనం’ మూవీని జితేంద్ర హీరోగా ‘సింగాసన్’ పేరుతో రీమేక్ చేశారు.. అక్కడ కూడా ఘనవిజయం సాధించింది..

3) శంఖారావం..

కృష్ణ, తనయుడు మహేష్ బాబుతో నటించడమే కాక.. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, డైరెక్షన్ చేసిన ఈ యాక్షన్ ఫిలిం సూపర్ హిట్ అయ్యింది..

4) కలియుగ కర్ణుడు..

నటశేఖర నటిస్తూ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చేసిన మరో మూవీ ‘కలియుగ కర్ణుడు’..

5) ముగ్గురు కొడుకులు..

ఈ సినిమాకో ప్రత్యేకత ఉంది.. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ మీద కృష్ణ గారి అమ్మ గారు ఘట్టమనేని నాగ రత్నమ్మ నిర్మించగా.. రియల్ లైఫ్ పిల్లలు రమేష్ బాబు, మహేష్ బాబులతో కలిసి నటించి.. స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్ కూడా చేశారు సూపర్ స్టార్..

6) కొడుకు దిద్దిన కాపురం..

కొడుకు మహేష్ బాబుతో నటించగా సూపర్ హిట్ అయిన ఫ్యామిలీ పిక్చర్.. ‘కొడుకు దిద్దిన కాపురం’.. నిర్మాణం, దర్శకత్వం, చిత్రానువాదం, కూర్పు కృష్ణ గారే..

7) రిక్షావాలా..

సూపర్ స్టార్ హీరో, డైరెెక్షన్ చేయగా.. సమర్పణ కింద పద్మాలయా స్టూడియోస్ పతాకం పేరు వేశారు..

8) అన్నా – తమ్ముడు..

కృష్ణ, మహేష్ అన్నాదమ్ముళ్లుగా నటించిన ఈ చిత్రానికి ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎడిటర్, స్క్రీన్‌ప్లే రైటర్ కూడా ఆయనే..

9) బాలచంద్రుడు..

మహేష్ బాబు అప్పటికే బాలనటుడిగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు.. తన పేరుకి ముందు ‘ఒమెగా స్టార్’ అని వేసేవారు.. కొడుకుని ప్రధాన పాత్రలో నటింపజేస్తూ.. దర్శకత్వంతో పాటు ఎప్పటిలానే తన శాఖలన్నిటికీ పని చేశారు కృష్ణ..

10) నాగాస్త్రం..

ఈ మూవీలో హీరోగా నటిస్తూ.. డైరెక్టర్, ఎడిటర్, స్క్రీన్‌ప్లే రైటర్‌గానూ వర్క్ చేశారు..

11) ఇంద్రభవనం..

తన బ్యానర్ మీద తమ్ముడు జి.నరసింహ రావు నిర్మాతగా వచ్చిన కృష్ణ, కృష్ణంరాజుల మల్టీస్టారర్ మూవీ ఇది..

12) అల్లుడు దిద్దిన కాపురం..

‘కొడుకు దిద్దిన కాపురం’ తర్వాత, కొడుకు స్థానంలో అల్లుడు పేరుతో నటశేఖర తెరకెక్కించిన సినిమా ఇది..

13) రక్తతర్పణం..

ఈ చిత్రానికి కూడా సూపర్ స్టార్ హీరో, డైరెెక్షన్ చేయగా.. సమర్పణ కింద పద్మాలయా స్టూడియోస్ పతాకం పేరే పడుతుంది..

14) మానవుడు.. దానవుడు..

కృష్ణ నాయకుడిగా, ప్రతి నాయకుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ.. సమర్పణతో పాటు స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చేశారు..

15) పండంటి సంసారం (2001)

తన కెరీర్లో మరపురాని చిత్రంగా మిగిలిపోయిన ‘పండంటి కాపురం’ పేరు వచ్చేలా కృష్ణ తెరకెక్కించిన మూవీ ఇది..

16) ఇష్క్ హై తుమ్‌సే..

సూపర్ స్టార్ మానిటర్ ముందు కూర్చున్న చివరి సినిమా ఇది.. దీపక్, కాంచి కౌల్ నటించగా సానా యాదిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సూపర్ హిట్ మూవీని హిందీలో డినో మోరియా, బిపాషా బసు ప్రధాన పాత్రధారులుగా.. పద్మాలయా బ్యానర్ మీద కృష్ణ గారి సోదరుడు జి.ఆదిశేషగిరి రావు నిర్మించగా.. నటశేఖర డైరెక్ట్ చేశారు.. దర్శకుడి కృష్ణకిది రెండో సినిమాతో పాటు చివరి సినిమా కూడా కావడం విశేషం..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus