రజినీ కాంత్‌లో ఏం నచ్చి ఆయన భార్య లత ఇష్టపడ్డారో తెలుసా..!

  • February 28, 2023 / 11:47 PM IST

ఇప్పుడంటే సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది కానీ.. ఆరోజుల్లో ఇంత మీడియా, సోషల్ మీడియా, అప్ డేట్స్ వంటి హంగామా లేదు.. ఒక సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గరి నుండి గుమ్మడికాయ కొట్టే వరకు ప్రతి విషయం అఫీషియల్‌గా వస్తేనే వాస్తవం.. ఇప్పుడా పరిస్థితి లేదు.. అంతా లీకేజీల మయం అయిపోయింది.. ఇక సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విశేషాలు కూడా అప్పట్లో వారు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వూల్లో తమంతట తాము చెప్తేనే కానీ బయట ప్రపంచానికి తెలియదు..

ఇప్పు]డంతా ఓపెన్ బుక్కే.. గాసిప్పులు, రూమర్లే.. కానీ స్టార్ల రియల్ లైఫ్ గురించి ఎప్పుడు తెలిసినా ఆసక్తికరంగానే అనిపిస్తుంటుంది.. ఇప్పుడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్, ఆయన భార్య లతల లవ్ స్టోరీ గురించి గతంలో వచ్చిన న్యూస్ ఆర్టికల్ ఒకటి వైరల్ అవుతోంది.. పెళ్లి కాక ముందు రజినీ బాగా టెంపర్ అట.. ముక్కుసూటిగా ఉండేవారట.. అన్యాయాన్ని అసలు భరించే వారు కాదట.. అందుకేనేమో ఆయనను యాంగ్రీ యంగ్ మెన్ అనేవారు..

రజినీకి మరో సహ నటుడు వై.జి. మహేంద్రన్ మంచి స్నేహితుడు.. ఈయన ఒక్కడు మాత్రమే సూపర్ స్టార్‌కి స్నేహితుడని చెప్తుంటారు.. తరుచూ ఆయన ఇంటికి వెళ్లుండేవారు రజినీ.. అప్పుడే మహేంద్రన్ చెల్లెలు లత, రజినీని ఇష్టపడ్డారు.. రజినీ వ్యక్తిత్వం, మాన్లీనెస్ ఆమెకు బాగా నచ్చడంతో.. ఇరువురూ ప్రేమించి వివాహం చేసుకున్నారు.. అయితే పెళ్లి తర్వాత లత, భర్తలోని యాంగ్రీనెస్ మొత్తాన్ని తగ్గించేసి.. పూర్తిగా మార్చేసినట్లు తమిళ ఇండస్ట్రీ వారు చెప్తుంటారు..

భార్య ప్రభావమో ఏమో కానీ పెళ్లి తర్వాతే రజినీ పూర్తిగా రాఘవేంద్ర స్వామి భక్తుడిగా మారిపోయారు.. శ్రీమతి లత ప్రభావం రజినీ వెనుక చాలా ఉందని.. తమిళనాట రజినీ తిరుగులేని టాప్ స్టార్‌గా ఎదగడానికి లత కారణమని చెప్తుంటారు.. ఇన్నాళ్లూ సూపర్ స్టార్ మ్యారేజ్ వెనుక ఇంత లవ్ స్టోరీ ఉందని ఎవరికీ పెద్దగా తెలియదు..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus