Rajinikanth: తలైవా సినిమాలకు దూరం కానున్నారా..?

  • May 27, 2021 / 09:20 PM IST

సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ఎన్నో సినిమాలు సంచలనాలు క్రియేట్ చేశాయి. రజినీకాంత్ నటించిన సినిమాలు విదేశాల్లో కూడా రికార్డులను సృష్టించాయి. ప్రస్తుతం రజినీకాంత్ అన్నాత్తే సినిమాలో నటిస్తుండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. రజినీకాంత్ కు జోడీగా ఈ సినిమాలో నయనతార నటిస్తుండగా రజినీకాంత్ కు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. అయితే రజినీకాంత్ అన్నాత్తే చిత్రయూనిట్ తో మాట్లాడుతూ తనకు నటుడిగా అన్నాత్తే చిత్రం సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు.

తనకు మరికొన్ని సినిమాలలో నటించాలని ఉందని అయితే వయస్సు అందుకు సహకరిస్తుందా..? లేదా..? అనే విషయం భగవంతునిపై ఆధారపడి ఉందని రజినీకాంత్ అన్నారు. ఆరోగ్య కారణాల వల్ల రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఆరోగ్యం సహకరించకపోతే మాత్రం రజినీకాంత్ చివరి సినిమా అన్నాత్తే అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ర‌జినీకాంత్ రిటైర్ మెంట్ గురించి వస్తున్న వార్తలు విని ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

మన దేశంలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్ హీరోల్లో ఒకరైన రజినీకాంత్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. ఆరోగ్య సమస్యల వల్లే రజినీకాంత్ రాజకీయాలకు కూడా దూరమైన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ఉధృతి వల్ల కూడా రజినీకాంత్ సినిమాకు దూరం కావాలని భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు కరోనా కేసులు తగ్గిన తరువాత రజినీకాంత్ మరోసారి అమెరికాకు వెళ్లి పరీక్షలు చేయించుకోనున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus