Supritha: సురేఖ వాణి కూతురు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
August 3, 2023 / 10:06 PM IST
|Follow Us
సురేఖా వాణి కూతురు సుప్రీత అందరికీ సుపరిచితమే. ఈమె ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయినా సోషల్ మీడియాలో ఎంతో మంది మనసులు కొల్లగొట్టి.. భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తన తల్లి సురేఖ వాణితో ఈమె కలిసి చేసే డాన్స్ లు బాగా ఫేమస్. ఒక్కోసారి వాటి వల్ల సుప్రీత కూడా ట్రోల్ అవుతూ ఉంటుంది. ఆమె డ్రెస్సింగ్ పై కొందరు నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తుంటారు.
అలాగే ఈమె గురించి, సురేఖ వాణి (Supritha) గురించి సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు వాటికి ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చి క్లారిటీ ఇస్తుంటుంది సుప్రీత. ఇక ఇటీవల సుప్రీత తన తల్లితో కలిసి న్యూజెర్సీకి వెళ్ళొచ్చింది. అక్కడ వీళ్ళు కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక జూలై నెలలో ఆమె నేర్చుకున్న పాఠాలు అంటూ సుప్రీత ఓ పోస్ట్ పెట్టింది.
అందులో .. ‘ ఒక్కోసారి ఒక్క మనిషి వల్ల కూడా జీవితం తలక్రిందులు అయిపోవచ్చు. మీ ప్లాన్ చేసింది జరగకపోతే… మీ ప్లాన్ ను మార్చుకోండి. మీకు ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేయండి. వర్కౌట్ అయితే ఓకే. లేదంటే .. మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు నచ్చని వాటికి మీరు ఓకే చెప్పకండి. అది నచ్చని ప్లేస్ అయినా.. నచ్చని జాబ్ అయినా ‘ అంటూ సుప్రీత చెప్పుకొచ్చింది.