Supritha: మానసికంగా కృంగదీస్తున్నారు.. ఆవేదన చెందిన సుప్రీత?
December 5, 2023 / 05:30 PM IST
|Follow Us
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి కూతురిగా సుప్రీత అందరికీ ఎంతో సుపరిచితమే. ఇండస్ట్రీలో రావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా సుప్రీత ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన తల్లితో కలిసి చేసే రీల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ఈ తల్లి కూతుర్లు చేసే హంగామా మామూలుగా ఉండదని చెప్పాలి.
ఇక వీరిద్దరి గురించి నేటిజన్స్ ఎన్నో రకాల ట్రోల్స్ చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు వాటి గురించి పెద్దగా పట్టించుకోరు కానీ ఈసారి మాత్రం సుప్రీత తన పట్ల వచ్చినటువంటి ట్రోల్స్ పై ఘాటుగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇటీవల తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలలో భాగంగా కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయడంతో ఈమె తన తల్లితో కలిసి రేవంత్ రెడ్డి వద్ద దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వీరి పట్ల ట్రోల్స్ చేశారు .అప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలవగానే అక్కడికి జంప్ అయ్యారా అంటూ భారీ స్థాయిలో విమర్శలు కురిపించారు. అయితే ఎన్నికలకు ముందు సుప్రీత బి.ఆర్.ఎస్ పార్టీనీ ప్రమోట్ చేస్తూ ఎన్నో వీడియోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే బి ఆర్ ఎస్ ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారా అంటూ వీరి పట్ల ట్రోల్స్ చేశారు
అయితే ఈ ట్రోల్స్ పై స్పందించిన సుప్రీత నేనేం తప్పు చేశానని అంతగా ట్రోల్ చేస్తున్నారు మీరు చేసే కామెంట్లు నన్ను ఎంతగా వేధిస్తున్నాయో మీకు తెలుసా నన్ను మానసికంగా కృంగతీస్తున్నారు అంటూ ఈమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా ఈమె చేస్తున్నటువంటి పోస్ట్ పై కొందరు మద్దతు తెలియజేస్తూ సాక్షాత్తు కేటీఆర్ కెసిఆర్ కూడా కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈమె చెబితే తప్పేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.