గూడాచారిలో ఆసక్తిరేపుతున్న సుప్రియ లుక్

  • July 4, 2018 / 01:51 PM IST

క్షణం సినిమాతో అడవి శేష్ అందరి దృష్టిని ఆకర్షించారు. విభిన్నమైన కథలను ఎంచుకొని దూసుకుపోతున్నారు. యువ దర్శకుడు శశికాంత్‌ టిక్కా దర్శకత్వంలో అతను తాజాగా చేసిన చిత్రం గూడాచారి. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకం పై అభిషేక్‌ నామా నిర్మించిన ఈ మూవీ టీజర్ ఈ రోజు రిలీజ్ అయి విశేష స్పందన అందుకుంది. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, హీరో సమంత సోదరి అయిన సుప్రియ కూడా కనిపించి ఆసక్తిని పెంచారు. సుప్రియ “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ తో కలిసి వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ చిత్రంలో హీరోయిన్ గా ఆకట్టుకున్నారు.

ఆ తర్వాత తెర వెనుక కీలక బాధ్యతలు చేపట్టారు. “అన్నపూర్ణ స్టూడియోస్‌’ బ్యానర్‌లో వస్తున్న సినిమాలకు నిర్మాతగా సుప్రియ వ్యవహరించారు. మళ్ళీ ఇప్పుడు తెర ముందుకు వచ్చారు. అంటే 22 ఏళ్ళ తర్వాత మళ్లీ తెరపై కనిపించారు. టీజర్ లో సుప్రియ సీరియస్ లుక్ చూస్తుంటే ఏదో పవర్ ఫుల్ గా పోషించినట్టు అర్ధమవుతోంది. మరో మాట సుమంత్ కి అక్క అంటే ఎవరూ నమ్మనంత యంగ్ గా కనిపించడం మరో విశేషం. ఈసారి ఎంతమేర ఆకట్టుకుంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus