Surekha Vani: సాంప్రదాయాలు మర్చిపోయావా సురేఖ వాణి.. ఇలా తయారయ్యావ్ ఏంటి?
March 4, 2023 / 07:06 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి గుర్తింపు పొందారు. అలా గుర్తింపు పొందిన వారిలో సురేఖ వాణి కూడా ఒకరు. ఎన్నో సినిమాలలో అక్క చెల్లి అత్త వదిన తల్లి మంచి పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది. అయితే సురేఖ వాణి భర్త మరణించిన తర్వాత ఆమె సినిమాలను కొంత తగ్గించింది. అయితే ఇలా సినిమాలకు దూరమైనప్పటికి సోషల్ మీడియాలో ఈమె హవా కొనిగిస్తున్నారు. కూతురు సుప్రీతతో కలిసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేస్తున్న సందడి అంతా కాదు.
సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న సందడికి ఎంతోమంది ఆమె అభిమానులుగా మారారు. సోషల్ మీడియాలో కూతురితో కలిసి సందడి చేయడమే కాకుండా అన్నంలో కూతురికి పోటీగా పొట్టి బట్టలు వేసుకొని గ్లామర్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ సందడి చేస్తోంది. అంతేకాకుండా కూతురితో కలిసి పబ్బులు పార్టీలు అంటూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తోంది. ఇలా ఈ వయసులో కూడా పబ్బులలో పార్టీలో చేసుకోవటం, గ్లామర్ ఫోటోలతో రెచ్చిపోవడంతో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆ ట్రోలింగ్ గురించి పట్టించుకోకుండా డోంట్ కేర్ అంటూ తన పని తాను తీసుకుపోతోంది.
ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సురేఖ వాణి తాజాగా ఒక ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ ఇదేమి అరాచకం రా బాబు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఎరుపు రంగు చీర ధరించి నుదుటిన పెద్ద బొట్టు మెడలో తాళిబొట్టు వేసుకుని ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో క్షణాలలో వైరల్ గా మారింది.
అయితే సురేఖ వాణి ఇలా మెడలో తాళిబొట్టు ధరించి నుదుటిన బొట్టు పెట్టుకోవడంతో పెల్లిడుకొచ్చిన కూతురిని ఇంట్లో పెట్టుకొని ఈ వయసులో రెండో పెళ్లి అవసరమా అంటూ భారీగా ట్రోల్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం సినిమాలో క్యారెక్టర్ కోసం అలా ధరించి ఉంటుందని పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే సురేఖవాణి సాంప్రదాయాలు మర్చిపోయారా అంటూ ఈమె వ్యవహార శైలి పై కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సురేఖ వాణి షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.