Supritha: నెటిజన్లను అవాక్కయ్యేలా చేసిన సుప్రీత..!
June 22, 2021 / 09:50 PM IST
|Follow Us
సురేఖావాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సురేఖావాణి, సుప్రీత కలిసి చేసిన డ్యాన్స్ వీడియోలు కొన్ని నెలల క్రితం నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. భవిష్యత్తులో సుప్రీత సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తుండగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారనే విషయం తెలియాల్సి ఉంది. చీరకట్టులో సురేఖావాణి, సుప్రీత చేసే రచ్చ అంతాఇంతా కాదు. సురేఖావాణి గురించి ఏవైనా ఫేక్ వార్తలు వైరల్ అయినా సుప్రీత ఆ వార్తల గురించి వెంటనే స్పందించడంతో పాటు ట్రోలర్లకు ధీటుగా కౌంటర్లు ఇస్తారు.
కొన్నిరోజుల క్రితం ఒక నెటిజన్ మీరు తాగుతారు కదా అంటూ ఇష్టానుసారం మాట్లాడగా ఆ నెటిజన్ పై సుప్రీత తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కొన్నిసార్లు ట్రోల్స్ విషయంలో సుప్రీత అతిగా స్పందిస్తారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లతో సుప్రీత ముచ్చటించడంతో పాటు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ఒక నెటిజన్ సిప్ తాగాక ఒంటరిగా ఫీల్ అవుతారా..? అని ప్రశ్నించగా వైన్ బాటిల్ తాగిన తర్వాత అలా అనిపించొచ్చని సుప్రీత చెప్పుకొచ్చారు.
సుప్రీత అలా చెప్పడంతో అవాక్కవ్వడం నెటిజన్ల వంతైంది. పరోక్షంగా తాను వైన్ తాగుతానని సుప్రీత వెల్లడించడం గమనార్హం. సుప్రీత సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీత హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతారని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.