‘లైగర్’ కి జరిగినట్టే.. ‘ఏజెంట్’ విషయంలో కూడా జరిగిందా?

  • April 29, 2023 / 08:16 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు… ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల కాల్ షీట్లు ఖాళీ లేక.. మిడ్ రేంజ్ హీరోల మీద పడ్డారు. స్టార్ డైరెక్టర్ తో సినిమా అనగానే మిడ్ రేంజ్ హీరోలు అందులోనూ యంగ్ హీరోలు గుడ్డిగా నమ్మేసి… మొత్తం సరెండర్ అయిపోతున్నారు. ‘లైగర్’ ‘ఏజెంట్’ సినిమాలను వీటికి బెస్ట్ ఎగ్జామ్పుల్ గా చెప్పుకోవచ్చు. ‘లైగర్’ సంగతి చూసుకుంటే.. పాన్ ఇండియా సినిమా తీయాలి అనే ఆరాటంలో అనవసరమైన ఆడంబరాలకు పోయి తన బలాన్ని వదిలేసాడు పూరి అని ప్రతి ఫ్రేమ్ లోనూ తెలుస్తుంది.

‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ లైన్ నే కొంచెం అటు ఇటు మార్చేసి.. బాలీవుడ్ వెర్షన్లో తీసాడు. ఇందుకోసం విజయ్ దేవరకొండని బాగా కష్టపెట్టాడు. సిక్స్ ప్యాక్ బాడీ చేయించి, అతనితో బట్టలు లేకుండా ఫోజులు ఇప్పించడం వంటివి చేయించాడు. నిజానికి పూరి సినిమాలో హీరో ఎలా ఉంటాడు. పంచ్ డైలాగులు ఓ రేంజ్లో చెబుతుంటాడు. అవి అతనికి నచ్చినట్టే ఉన్నా..

అందులో చాలా దమ్ము ఉంటుంది. విజయ్ దేవరకొండకి నత్తి పెట్టేసి.. తోలుబొమ్మని ఆడించినట్టు ఆడించాడు పూరి. ‘ఏజెంట్’ విషయంలో సూరి.. కూడా పూరిలానే చేశాడు. అఖిల్ ను రెండేళ్ల పాటు కష్టపెట్టాడు. ఒక సీన్ ను నెల రోజుల చొప్పున తీసాడు. అఖిల్ లాంటి ఎనర్జిటిక్ హీరోని కరెక్ట్ గా వాడితే తప్పకుండా హిట్టు కొట్టొచ్చు.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి ఓ హిట్ కొట్టి.. ఊపిరి పీల్చుకున్న (Akhil) అఖిల్ కు.. అతను మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. దానికి కొంచెం కామెడీ టచ్ ఉన్న సినిమాని అందిస్తే.. అటు అఖిల్ కు ప్లస్ అయ్యేది.. ఇటు సూరికి ప్లస్ అయ్యేది. డబ్బులు పెట్టే నిర్మాత ఉన్నాడు, చెప్పినట్టు చేసే మిడ్ రేంజ్ హీరోలు ఉన్నారు..

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus