Suresh Babu: ఓటిటి ల పై, థియేటర్ల భవిష్యత్తు పై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్..!
June 1, 2021 / 05:23 PM IST
|Follow Us
దగ్గుబాటి సురేష్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు ఓ ఎగ్జిబిటర్ కూడా..! ఈయన హయాంలో చాలా థియేటర్లు రన్ అవుతున్నాయి. థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడు ఏమి ఆశించి వస్తాడో అనే విషయంతో పాటు.. ఆ ప్రేక్షకుడు థియేటర్ కు రావడానికి ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు.. అనే విషయం పై కూడా ఈయనకు పూర్తి అవగాహన ఉంటుంది. అలాంటి సురేష్ బాబు.. ఇటీవల ఓటిటిల ఎఫెక్ట్ థియేటర్ల పై కచ్చితంగా పడుతుంది అంటూ కామెంట్లు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
‘ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్.. తన ఫ్యామిలీని సినిమాకి తీసుకెళ్లాలి అంటే వేలల్లో ఖర్చు చెయ్యాలి. కాబట్టి అతను థియేటర్ కు వచ్చి సినిమా చూడాలి అని అనుకోవడం లేదు’ అంటూ ఆయన భావిస్తున్నట్లు సురేష్ బాబు తెలిపారు. అంతేకాదు.. ‘కొద్దిరోజుల్లోనే ఆ సినిమాని తన మొబైల్ లో లేదా టీవీల్లో నచ్చిన విధంగా చూసుకోవడానికే ఇష్టపడుతున్నాడు. ఓటిటిల వల్ల అది సాధ్యమవుతుంది. అయితే మేజర్ సిటీల్లో జనాలు థియేటర్లలో సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా వీకెండ్ కు కచ్చితంగా మల్టీ ప్లెక్స్ కు వెళ్లాలని.. దానికోసం టైం కేటాయించుకుంటున్నారు.
కాబట్టి మేకర్స్ ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమాలు చెయ్యాలి. బడ్జెట్ ను హద్దులు దాటకుండా జాగ్రత్త పడాలి.’ అంటూ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘మరి మీరు ఎందుకు ఇంకా ఓటిటి రంగం వైపు అడుగులు వేయడం లేదు?’ అని సురేష్ బాబుని ప్రశ్నించగా.. ‘ ‘అమెజాన్ ప్రైమ్’ ‘నెట్ ఫ్లిక్స్’ వంటి కంపెనీలు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి.. నష్టాల్లో రన్ అవుతున్నాయి.కాబట్టి నాకు ఇప్పట్లో ఓటిటి రంగం వెళ్లాలని లేదు’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.