మే 6 న ’24’..!

  • April 16, 2016 / 10:33 AM IST

సూర్య త్రిపాత్రిభినయం చేయడంతోపాటు నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరిస్తూ రూపొందించిన చిత్రం ’24’. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం మే 6 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో మరియు ట్రైలర్ ను విడుదల చేయగా.. శ్రోతల నుంచి, అభిమానుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. సూర్య మొదటి సారి విలన్ పాత్రలో నటించడం విశేషం!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus