సుశాంత్ సింగ్ తండ్రి ఫిర్యాదులో దిగ్బ్రాంతికర విషయాలు
July 29, 2020 / 08:20 PM IST
|Follow Us
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి నెలన్నర కావస్తుంది. బాలీవుడ్ లో సంచలనంగా మారిన సుశాంత్ సూసైడ్ కేసు పెద్ద సంచలనానికి తెరలేపింది. బాలీవుడ్ పెద్దలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కాగా, కరణ్ జోహార్, సల్మాన్, అలియా భట్ మరియు కరీనా వంటి వారిని నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా తీవ్ర విమర్శలు చేశారు.మరో వైపు ఈ కేసు విచారణ ముంబై పోలీసులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అనేక మందిని విచారించడం జరిగింది. ఐతే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై తీవ్ర ఆరోణలు ఉన్నాయి. ముఖ్యంగా ముంబై పోలీసులు ఆమెను పలుమార్లు విచారణకు పిలవడం జరిగింది.
సుశాంత్ మరణించడానికి ముందు రోజు రాత్రి అనేక సార్లు రియాకు ఫోన్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఐతే ఆమె ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కాగా సుశాంత్ సింగ్ తండ్రి రియా పై బీహార్ లో కేసుపెట్టారు. తన రిపోర్ట్ లో ఆయన షాకింగ్ విషయాలు బయటపెట్టారు. నిజానికి సుశాంత్ సినిమాలు వదిలేసి కేరళలోనే కూర్గ్ ప్రాంతంలో సెటిల్ అవ్వాలని కోరుకున్నారట. సుశాంత్ సినిమాలు మానేస్తే తనకు అతన్నుండి వచ్చే డబ్బులు ఆగిపోతాయన్న భయంతో దానికి ఆమె ఒప్పుకోలేదట.
అలాగే సుశాంత్ అలా చేస్తే… అతని మెడికల్ రిపోర్ట్స్ బయట పెడతానని భయపెట్టిందట. అలాగే సుశాంత్ వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు మరియు బంగారం రియా దోచుకుందని, సుశాంత్ తండ్రి తన రిపోర్ట్ లో పేర్కొన్నాడు. కాగా రియా అరెస్ట్ ఖాయం అని బాలీవుడ్ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. అందుకే ఓ ప్రముఖ లాయర్ ని కూడా రియా నియమించుకున్నారు.