Sushanth: 15 ఏళ్ళ కెరీర్లో సుశాంత్ ఆ సినిమాని వదులుకున్నందుకు బాధపడుతుంటాడట!
April 3, 2023 / 08:36 PM IST
|Follow Us
అక్కినేని నాగేశ్వరరావు గారి చిన్న కూతురు నాగ సుశీల కూతురి బిడ్డగా, నాగార్జున మేనల్లుడిగా .. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్. అతను హీరోగా ఎంట్రీ ఇచ్చిన కాళిదాసు చిత్రం విడుదలై ఈ ఏప్రిల్ 11 కి 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అలాగే అతను ఓ కీలక పాత్ర పోషించిన రావణాసుర చిత్రం ఈ ఏప్రిల్ 7 న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సుశాంత్.. ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించాడు. ఈ క్రమంలో తన కెరీర్ కు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అలాగే రావణాసుర చిత్రానికి సంబంధించిన కీలక విషయాలను చెప్పుకొచ్చాడు.
అల వైకుంఠపురములో .. చిత్రం తనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అని చెప్పిన సుశాంత్ (Sushanth).. రావణాసుర లో కూడా తన పాత్ర చాలా బాగుంటుంది అని తెలిపాడు. దర్శకుడు సుధీర్ వర్మ తన పాత్రను చాలా బాగా తీర్చిదిద్దినట్టు అతను చెప్పుకొచ్చాడు. అలాగే తన 15 ఏళ్ళ కెరీర్ లో మిస్ చేసుకున్న సినిమా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ‘ ఎక్స్ ప్రెస్ రాజా ‘ మూవీ అని, ముందుగా ఆ కథ తనే విన్నట్టు కూడా తెలిపాడు.
ఆ ప్రాజెక్టు కచ్చితంగా తనే చేద్దాం అనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులో నటించలేకపోయానని, తర్వాత శర్వానంద్ అది చేయడం సూపర్ హిట్ అవ్వడం జరిగిందని సుశాంత్ తెలిపాడు. ఇంకా కొన్ని సినిమాలు ఉన్నా.. ఈ సినిమా మిస్ చేసుకున్నందుకు మాత్రమే ఎక్కువగా రిగ్రెట్ ఫీలవుతానని .. అతను చెప్పుకొచ్చాడు.
ఇక ఎక్స్ ప్రెస్ రాజా చిత్రం 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఎన్టీఆర్… నాన్నకు ప్రేమతో, నాగార్జున.. సోగ్గాడే చిన్ని నాయన, బాలకృష్ణ… డిక్టేటర్ వంటి చిత్రాలు రిలీజ్ అయిన టైంలో రిలీజ్ అయ్యి విజయం సాధించడం .. విశేషంగా చెప్పుకోవాలి.