Sushmita: మేనల్లుడు పుట్టాలని కోరికగా ఉంది

  • January 15, 2023 / 11:55 AM IST

మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదల అయ్యి అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి మాస్ లుక్ లో చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవికి ఈ సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించిన సుస్మిత కొణిదేల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సినిమాకి తాను కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న సమయంలో డైరెక్టర్ బాబి తనకు ముఠామేస్త్రి సినిమాలో లుక్ కావాలని చెప్పారు. దాంతో ఈ సినిమాలో నాన్న కాస్ట్యూమ్ కోసం పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా పోయిందని తెలిపారు. అయితే తాను ఏం డిజైన్ చేసినా ముందుగా నాన్నతో చర్చిస్తానని సుస్మిత తెలిపారు.

ఇక ఈ సినిమా మంచి మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నాన్న ఎంతో ఉత్సాహంగా షూటింగ్ కి హాజరయ్యే వారు. ఈ సినిమా షూటింగ్ లోకేషన్ లో ఎప్పుడు ఒక పండుగ వాతావరణంలాగే ఉండేది.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మంచి విజయం అందుకుంటుందని అప్పుడే అనిపించింది అంటూ సుస్మిత ఈ సినిమా గురించి తెలియజేశారు. ఇలా ఈ ఇంటర్వ్యూలో వాల్తేరు వీరయ్య సినిమా గురించి మాత్రమే కాకుండా ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి కూడా ఈమె మాట్లాడారు.

ఉపాసన తల్లి కాబోతుందని తెలియడంతో చాలా సంతోషం వేసిందనీ అందరూ కూడా రాబోయే బుజ్జి మేనల్లుడు లేదా మేనకోడలు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.అయితే ఇద్దరిలో మాకు ఎవరి పుట్టిన సంతోషమే కానీ ఇప్పటికే ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు కనుక మేనల్లుడు పుడితే బాగుంటుందని అనుకుంటున్నాను అంటూ సుస్మిత ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus