Sushmita: సుష్మిత డెసిషన్ కు షాక్ అవుతున్న మెగా అభిమానులు..!

  • December 10, 2021 / 07:41 PM IST

మెగా ఫ్యామిలీ నుండీ టాలీవుడ్ కు చాలా మంది ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఆ ఫ్యామిలీ నుండీ 8 మంది హీరోలు ఎంట్రీ ఇచ్చాడు. అందులో అందులో ముగ్గురు స్టార్స్ గా ఎదిగారు. మరికొంతమంది మీడియం రేంజ్ హీరోలుగా నిలబడ్డారు. నిహారిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాల్లో నటించింది.అయితే ఆఫ్ ది స్క్రీన్ చిరంజీవి పెద్ద కూతురు కూడా చాలా కాలం నుండీ సినిమాలకి పనిచేస్తున్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు.

సుస్మిత కొణిదెల చిరు సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తూ వస్తోంది.’ఖైదీ నెంబర్ 150′ నుండీ ‘సైరా’ ‘ఆచార్య’ వరకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది. ఈ మధ్యనే ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ అనే నిర్మాణ సంస్థని స్థాపించి వెబ్ సిరీస్ లు,చిన్న సినిమాలు నిర్మించడానికి రెడీ అయ్యింది.అంతేకాకుండా ఓ విమెన్ సెంట్రిక్ సినిమాని కూడా రూపొందించడానికి సుస్మిత రెడీ అయ్యిందట.అయితే ఇందులో ప్రధాన పాత్రకి కృతి శెట్టిని ఎంపిక చేసుకున్నారట.

‘ఉప్పెన’ తో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న కృతిశెట్టి.. ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. ఆమె కాల్ షీట్లు సంపాదించడమే ఇప్పుడు చాలా కష్టమైపోయింది. అలాంటి భామతో విమెన్ సెంట్రిక్ మూవీ చేయడం మంచి ఆలోచనే కదా అని అంతా అనుకోవచ్చు. కాకపోతే కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న కృతి శెట్టితో విమెన్ సెంట్రిక్ మూవీ అంటే డేరింగ్ స్టెప్పే కదా అనేది ఇండస్ట్రీ అభిప్రాయం.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus