హీరోయిన్ గా చేయనని చెప్పింది.. తర్వాత పాటలో అడిగితే చేసింది: ఎస్వీ కృష్ణారెడ్డి
March 1, 2023 / 10:41 AM IST
|Follow Us
ఎస్వీ కృష్ణారెడ్డి ఒకప్పుడు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు. హీరో అవుదామని ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఇక్కడి పరిస్థితిని చూసి దర్శకుడిగానే రాణించగలం అని డిసైడ్ అయ్యి ..ఆ దిశగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అనతి కాలంలోనే వరుస హిట్లతో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు. సెంటిమెంట్, కామెడీ ఈయనకు ఆయుధాలు.వాటితోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి హిట్లు కొట్టారు. అయితే ఈయన ఫేడౌట్ అయ్యి చాలా కాలం అయ్యింది.
అయినా అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు.ఇటీవల ఈయన డైరెక్ట్ చేసిన ‘ఆర్గానిక్ మామ – హైబ్రిడ్ అల్లుడు’ చిత్రం త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఒకప్పటి హీరోయిన్ సౌందర్య గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ… . “సౌందర్యను నా సొంత చెల్లెలిగా చూసుకునేవాడిని. తను ఇంకా ఇంకా మంచి సినిమాలు చేస్తూ ఎదగాలని భావించేవాడిని. ఆమె కూడా చాలా కష్టపడేది.
తక్కువ టైంలోనే ఆమె స్టార్ డమ్ ను సంపాదించుకుంది. అయితే మొదట్లో ఆమెను అలీకి జోడీగా ‘యమలీల’ లో చేయమని అడిగాను. కానీ ఆమె కాల్ షీట్ల ప్రాబ్లమ్ వల్లో ఏమో చేయలేను అని చెప్పింది నాకు కూడా ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంద్రజను తీసుకున్నాను. నాకు ‘నో’ చెప్పిన సందర్భాన్ని ఆమె చాలా రోజులు తలుచుకుని బాధపడేదట.
ఆ విషయాన్ని వాళ్ళ నాన్న గారు నాకు చెప్పారు. ఒక్క పాటలో అయినా చేసుండాల్సింది అని సౌందర్య బాధపడేదని చెప్పడంతో.. ‘శుభలగ్నం’లో ‘చినుకు చినుకు అందెలతో’ పాట చేయించాను. ఆ టైంలో కూడా ఈమె చాలా బిజీగా ఉండి మరీ ఆ పాటలో అలీతో కలిసి స్టెప్పులు వేసింది” అంటూ ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.