Svetha Lakshmipathi: నాన్న చనిపోవడానికి కారణం అదే..సంచలన నిజాలు బయట పెట్టిన శ్వేత లక్ష్మీపతి
June 9, 2023 / 08:42 PM IST
|Follow Us
యాంకర్ గా అలాగే స్క్రిప్ట్ రైటర్ గా కమెడియన్ గా 70 కి పైగా సినిమాల్లో నటించిన లక్ష్మీపతి గారు చేసింది కొన్ని సినిమాలు అయినా తెలుగు ప్రేక్షకులు ఆయనని మర్చిపోలేరు. ఆంధ్రుడు, అల్లరి, కితకితలు, పెద్దబాబు వంటి సినిమాల్లో అయన కామెడీని ఎవరూ మర్చిపోలేరు. ఇక ఆయన విలన్ గా చేసిన ఏకైక సినిమా ఆయన తమ్ముడు శోభన్ దర్శకత్వం వహించిన మహేష్ బాబు సినిమా బాబీ. ఇక చూడాలని ఉంది సినిమాతో కమెడియన్ గా తెలుగులో బ్రేక్ తెచ్చుకున్న లక్ష్మీపతి గారు 2008 లో మరణించారు.
అయన మరణం కంటే నెల రోజుల ముందు ఆయన తమ్ముడు డైరెక్టర్ శోభన్ గుండెపోటుతో మరణించారు. ఇక నెల వ్యవధిలో కుటుంబంలో ఇద్దరినీ కోల్పోవడం ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేక పోవడంతో చాలా ఇబ్బందులు పడినట్లు లక్ష్మీపతి గారి కూతురు శ్వేత రెసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తన తండ్రి మరణించే రోజు కూడా ఫోన్ చేసారంటూ శ్వేత చెప్పారు. శ్వేత అమ్మ, తమ్ముడు ఇద్దరూ శ్వేతని చూడటానికి వైజాగ్ వెళ్లగా ఆరోజు తిరిగి హైదరాబాద్ వెళ్లారట.
ఇంకా వాళ్ళు ఇంటికి రాలేదని లక్ష్మీపతి కూతురికి ఫోన్ చేసి అడిగితే వస్తారు కాస్త ఎక్కడైనా ఆలస్యమైయుంటుంది అంటూ చెప్పి మామూలుగా మాట్లాడారట. తీరా మధ్యాహ్నం సమయంలో ఆయన అనారోగ్యాంగా ఉంది హాస్పిటల్ తెసుకెళ్ళమని ఫోన్ చేయగా తరచూ లక్ష్మీపతిగారు అనారోగ్యం పాలవుతూ ఉండటం వల్ల శ్వేత సీరియస్ గా తీసుకోలేదట. అయితే మరో బాబాయ్ ఫోన్ చేసి త్వరగా రా అని చెప్పేసరికి ఏదో జరిగిందని అర్థమై ఫ్లైట్ పట్టుకుని వెళ్లగా ఒక్కసారిగా నాన్న మరణించాడని తెలిసి షాక్ అయ్యాను.
సినిమాల్లోకి వచ్చాక తాగడం బాగా అలవాటైపోయింది దాంతో అయన ఆరోగ్యం పాడైంది. ఇక బాబాయ్ మరణంను అసలు తట్టుకోలేని నాన్న ఆ బాధతోనే మరణించారు అంటూ శ్వేత ఎమోషనల్ అయ్యారు. ఆయన అంత్యక్రియలకు మా (Svetha Lakshmipathi) వద్ద డబ్బులు లేక అందరూ ఆలోచిస్తుంటే ఇండస్ట్రీలో వాళ్ళే కొంతమంది సహాయం చేసారు అంటూ తెలిపారు.