బిగ్‌బాస్‌లో షాక్‌.. వచ్చిన వారమే ఎలిమినేట్‌!

  • October 3, 2020 / 08:18 PM IST

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అలాగే ఎవరు ఎప్పుడు ఎలిమినేట్‌ అవుతారో కూడా చెప్పలేం. ఈ రోజు కూడా అదే జరిగేలా కనిపిస్తోంది. ఇంట్లోకి వచ్చిన కొత్త హౌస్‌మేట్‌ను అప్పుడు బయటకు తీసుకొచ్చేస్తున్నారు అనిపిస్తోంది. అదేనండి స్వాతి దీక్షిత్‌ను అప్పుడే ఎలిమినేట్‌ చేస్తున్నారా.. అంటే కొత్త ప్రోమో చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ రోజు నామినేట్‌ అయిన వారిని సేఫ్‌ చేసే ప్రాసెస్‌ కాకుండా… ఏకంగా ఎలిమినేట్‌ చేసే ప్రాసెస్‌ను తీసుకొచ్చారు.

మామూలుగా అయితే ప్రతి వారం ఆదివారం ఎలిమినేషన్‌ ఉంటుంది. ఈ సారి శనివారమే పని కానిచ్చేస్తున్నారు. నాలుగో వారంలో కుమార్ సాయి, మెహబూబ్, సొహైల్, అభిజిత్, హారిక, స్వాతి దీక్షిత్, లాస్య నామినేషన్‌లో ఉన్నారు. వీరందరికీ నాగార్జున ఓ గన్‌ ఇచ్చి… కాల్చుకోమని అడిగారు. ఎవరి గన్‌లో బులెట్‌ పేలితో వారు ఎలిమినేట్‌ అయినట్లు చెప్పారు. ఈ ప్రాసెస్‌లో స్వాతి గన్‌ పేలినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను డైరెక్ట్‌గా ఎలిమినేట్‌ చేసేశారట.

ఈ ఎలిమినేషన్‌ విషయంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బయటకు తీసుకొస్తున్న స్వాతి దీక్షిత్‌ను ఇంటికి పంపించకుండా ఓ సీక్రెట్‌ రూమ్‌లో ఉంచుతారని అంటున్నారు. గత సీజన్లలో ఇలా పార్టిసిపెంట్లను సీక్రెట్‌ రూమ్‌లో ఉంచారు. గత సీజన్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ అలా వెళ్లి వచ్చినవాడే. ఈసారి ఆ ఛాన్స్‌ స్వాతికి వచ్చిందనీ వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె వచ్చిన తొలి వారంలోనే ఇలా చేస్తారా అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. చూద్దాం ఈ రోజు రాత్రి ఏమవుతుందో?

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus