Swathi Muthyam Collections: ‘స్వాతి ముత్యం’ మొదటి వీకెండ్ ఎలా కలెక్ట్ చేసిందంటే..?
October 10, 2022 / 04:16 PM IST
|Follow Us
బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతూ చేసిన మొదటి చిత్రం ‘స్వాతి ముత్యం’.నూతన దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 5న విజయదశమి కానుకగా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. మల్టీప్లెక్సుల్లో ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది. కానీ పండుగ ముగిసిన తర్వాత ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది అని చెప్పాలి.
ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
0.15 cr
సీడెడ్
0.07 cr
ఉత్తరాంధ్ర
0.10 cr
ఈస్ట్
0.07 cr
వెస్ట్
0.06 cr
గుంటూరు
0.08 cr
కృష్ణా
0.07 cr
నెల్లూరు
0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
0.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
0.73 cr (షేర్)
‘స్వాతి ముత్యం’ చిత్రానికి రూ.3.84 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు పాజిటివ్ టాక్ ను రాబట్టుకున్న ఈ మూవీ.. ప్రీమియర్స్ తో కలుపుకుని రూ.0.73 కోట్ల షేర్ ను రాబట్టింది. టాక్ పాజిటివ్ గా ఉన్నా ఈ మూవీ క్యాష్ చేసుకోకపోవడం గమనార్హం. అంతేకాకుండా 3వ రోజు నుండి ఈ మూవీకి డెఫిసిట్ లు కూడా పడ్డాయి. దీంతో నెగిటివ్ షేర్ చాలా వరకు ఉందని ట్రేడ్ పండితుల సమాచారం.