బిగ్ బాస్ హౌస్ లో 6వ వారం నామినేషన్స్ హీట్ ఇంకా తగ్గలేదు. హౌస్ మేట్స్ ఒకర్ని ఒకరు నిందించుకుంటూ ఈవారం ఏకంగా 10మందిని నామినేట్ చేశారు. ఇక్కడే శ్వేత సిరిని నామినేట్ చేసేటపుడు షణ్ముక్ అన్నమాటలని చెప్పింది. నేను వాష్ రూమ్ వైపు వస్తూ విన్నాను అని, నువ్వు వేరేవాళ్లని ప్రొవోగ్ చేస్తూ వాళ్ల కోపాన్ని బయటకి తీస్కుని వద్దాం అని అన్నావని అది కరెక్ట్ కాదని చెప్పింది. ఇదే మూడ్ ని మార్నింగ్ కూడా క్యారీ చేసింది శ్వేత. మార్నింగ్ టీ తాగుతూ, వేరేవాళ్ల ఎమోషన్స్ తో గేమ్ ఆడటం కరెక్ట్ కాదని, వాళ్లని రెచ్చగొడుతూ వాళ్ల ఆవేశాన్ని బ్యాట్ చేస్తూ నీకు ప్లస్ చేస్కోవడం తప్పు గేమ్ అని చెప్పింది.
ఇది ఖచ్చితంగా మాట్లాడాల్సిన ఇష్యూ అని తన బాధని చెప్పింది. కార్నర్ బ్యాచ్ పై ఫైర్ అయ్యింది శ్వేత. ఇక్కడే అనీమాస్టర్ ఇంకా రవిలు శ్వేతని కూల్ చేసే ప్రయత్నం చేశారు. నేను సరిగ్గానే ఉన్నాను అంటూనే ఆవేశంగా మాట్లాడింది శ్వేత.టాస్క్ జరిగేటపుడు రెచ్చిపోతే రెచ్చిపోని అది మానకి ప్లస్ అవుతుంది. వాళ్లలో కోపాన్ని ఇంకా బయటకి తీస్కుని వద్దాం అంటూ మాట్లాడారు అని ఇది కరెక్ట్ గేమ్ కాదని ఆవేశపడింది. దానిపైన నేను ఖచ్చితంగా మాట్లాడతాను అంటూ ఫైర్ అయ్యింది. మరోవైపు బిగ్ బాస్ ఈవారం బిబి బొమ్మల ఫ్యాక్టరీ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో కూడా శ్వేత చేతుల్లోనుంచీ బొమ్మ గుంజుకుని మరీ దాన్ని చింపేసింది.
అంతేకాదు, అందరికంటే కూడా గేమ్ స్ట్రాటజీని వాడుతూ బొమ్మల మెటీరియల్ ని దాచిపెట్టింది. గ్రీన్ టీమ్ లో ఉన్న శ్వేత రవి ఇంకా లోబోలతో కలిసి గేమ్ ఆడుతోంది. అలాగే ఈసారి ఎలాగైనా సరే కెప్టెన్సీ పోటీదారులుగా నిలుచుకుని కెప్టెన్ అవ్వాలని అనుకుంటోంది. ఇక ఈవారం నామినేషన్స్ లో ఉన్నాననే భయంతోనే శ్వేత ఎగ్రెసివ్ గా గేమ్ ఆడుతోందా అని కూాడ అనిపిస్తోంది. ఎందుకంటే హౌస్ లో 5వారాలు ఉన్నాా కూడా శ్వేత ఎప్పుడూ ఇలా గేమ్ ఆడలేదు.లాస్ట్ వీక్ రాజా టాస్క్ లో కూడా క్వాయిన్స్ గుంజుకోవడం ఇష్టం లేక వదిలేసింది. కానీ, ఇప్పుడు బరాబర్ బొమ్మలు గుంజుకుంటా అంటూ ఛాలెంజ్ చేస్తోంది శ్వేత. మరి ఈవారం నామినేషన్స్ నుంచీ శ్వేత గట్టెక్కుతుందా లేదా అనేది చూడాలి.