మెగా అభిమానులు మాత్రమే కాదు యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 285 కోట్ల భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2 న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రతో ఈ చిత్రం రూపొందింది. ఇక ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
కథ : స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ దొరలు తెలుగు ప్రజల పై పడి.. వారి సొంత భూములలో చాకిరి చేయిస్తూ.. వారికి రావాల్సిన సొమ్ముని అన్యాయంగా స్వాధీనం చేసుకుని… అష్టకష్టాలు పెడుతున్న రోజులవి. అడ్డం తిరిగిన ప్రజల్ని జాలి, దయ లేకుండా ప్రాణాలు తీస్తున్న రోజులవి..! అలాంటి పరిస్థితుల్లో ‘జమిందారి’ అయిన ‘సైరా నరసింహా రెడ్డి’ వారికి ఎలా ఎదురు నిలిచాడు.? వారిని ఎదుర్కొనడానికి ‘సైరా’ ఎసి ఎత్తుగడలు ఏమిటి. మధ్యలో ‘సైరా’ కి సాయం చేసిన వీరులు ఎవరు. చివరికి ‘సైరా నరసింహా రెడ్డి’ ని ఉరి తీసారా? ఇదే అసలు కథాంశం అని తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి : మెగాస్టార్ చిరంజీవి నటన ఈ చిత్రంలో ‘న భూతో న భవిష్యతి’ అని చెప్తారు అనడంలో సందేహమే లేదు. ఫస్ట్ హాఫ్ అంతా జమిందారుగా.. సెకండ్ హాఫ్ అంతా బ్రిటిష్ సైన్యం పై తిరుగుబాటు చేసే వీరుడిగా ఆయన ఇరక్కొట్టేశారు. ఈ క్రమంలో మెగాస్టార్ చేసే కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు ప్రేక్షకులు చేత చప్పట్లు కొట్టించడం ఖాయం.
నయనతార : ‘సైరా’ కి భార్యగా నయన కూడా అద్భుతంగా నటించింది. ఈమె క్రేజ్, నటన సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవడం ఖాయం అని తెలుస్తుంది.
రత్నవేలు : సినిమాని ‘పాన్ ఇండియా’ కళ వచ్చేలా చేసాడు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. స్వాతంత్య్రం రాక ముందు భారతదేశం పరిస్థితి ఎలా ఉండేది అనే దగ్గర నుండీ… యాక్షన్ సీక్వెన్స్ లు, విజువల్స్, పాటలను చిత్రీకరించిన విధానానికి ఈయన్ని మెచ్చుకోకుండా ఉండలేము.
సంగీతం: ఈ చిత్రంలో 4 పాటలే ఉన్నప్పటికీ వాటికి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం జూలియస్ పాకియం అందించాడు. ‘ఏక్ ద టైగర్’ ‘ధూమ్ 3’ ‘కిక్’ వంటి బాలీవుడ్ చిత్రాలకి సంగీతం అందించిన జూలియస్ పాకియం.. ‘సైరా’ చిత్రానికి కూడా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. ‘వాటర్ సీక్వెన్స్’ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లయిమాక్స్ కు ఈయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ‘గూజ్ బంప్స్’ రావడం ఖాయమనే చెప్పాలి.
నిర్మాత : స్టార్ హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క తన తండ్రితో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించి గిఫ్ట్ గా ఇవ్వడానికి ముందుకు వచ్చాడు రాంచరణ్. ఇంత పెద్ద నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని.. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కు సమకూర్చడం అంటే మాటలు కాదు. ఖర్చుకి ఏమాత్రం వెనుకాడకుండా దర్శకుడు ఏమడిగితే.. అది అందచేస్తూ.. ప్రతిష్టాత్మకంగా ‘సైరా’ ను రూపొందించాడు చరణ్. పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించే గట్స్ ఉన్న నిర్మాతని అని ఈ చిత్రంతో ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఖర్చు ఈ చిత్రంలో ప్రతీ ఫేమ్ లో కనిపించిందనే చెప్పాలి.
డైరెక్షన్ : ఇప్పటివరకూ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్ తీస్తూ వచ్చిన స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. అయినా ఎక్కడా తడబడకుండా ప్రతీ ప్రేక్షకుడిని సీట్లకి కట్టిపడేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంతో సురేందర్ రెడ్డి కూడా ‘పాన్ ఇండియా డైరెక్టర్’ అయిపోతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో ‘సైరా నరసింహా రెడ్డి’ టైటిల్స్ పడతాయని తెలుస్తుంది. ఇక సినిమా ఎండింగ్ లో పవన్ వాయిస్ తో కన్క్లూజన్ ఉంటుంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు పాత్రలు కూడా ‘సైరా’ కు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ‘ఝాన్సీ లక్ష్మీ బాయ్’ పాత్రలో అనుష్క కనిపించేది కాసేపే అయినా.. ఆ పాత్రకి క్లాప్స్ పడటం ఖాయం.
చివరి మాట : మెగాస్టార్ కదా అని ఏదో కమర్షియల్ సినిమా అనేలా కాదు.. ప్రతీ ఒక్కరికి ఓ మంచి సినిమా చూసాము అనుభూతిని కలిగిస్తుంది ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం. ఎమోషనల్ గా కూడా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
గమనిక : ఈ రివ్యూ ప్రముఖ సినీ క్రిటిక్ ట్వీట్ ని ఆధారం చేసుకొని రాసింది. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఫిల్మ్ ఫోకస్ రివ్యూ, రేటింగ్ రేపు రానుంది.
1
2
3
4
5
6
7
‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?