ప్రభాస్ అభిమానులకే కాదు.. మెగా అభిమానులకి కూడా పండగే
August 12, 2019 / 07:02 PM IST
|Follow Us
‘సాహో’ చిత్రం కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ‘బాహుబలి’ సినిమాలానే ఈ చిత్రం కూడా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందా…? అదే స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందా? అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. అయితే అదంత ఈజీ మేటర్ కాకపోయినా … ఆ చిత్రానికి దగ్గర్లో ఓపెనింగ్స్ ను సాధించినా ‘సాహో’ పెద్ద హిట్టనే చెప్పాలి. అదంతా ఆగష్టు 30 కి తేలిపోతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘సైరా’ చిత్రం ప్రమోషన్ కోసం ‘సాహో’ చిత్రాన్ని వాడుకుంటున్నారట. అదెలా కుదురుతుంది అనుకుంటున్నారా..?
విషయం ఏమిటంటే.. ‘సాహో’ చిత్రం నిర్మాతలైన ‘యూవీ.క్రియేషన్స్’ వారు ‘సైరా’ చిత్రాన్ని కూడా కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారట. ఈ క్రమంలో ‘సాహో’ చిత్రం సమయంతో పాటు ‘సైరా’ ట్రైలర్ ను కూడా థియేటర్లో ప్రదర్శించేలా ప్లాన్ చేస్తున్నారని తాజా సమాచారం. ‘సైరా’ ట్రైలర్ ను ముందుగా ‘సైమా’ అవార్డు వేడుకల్లో విడుదల చేస్తారట. అటుతరువాత ‘సాహో’ చిత్రంతో పాటు ‘సైరా’ ట్రైలర్ ను ప్రదర్శిస్తారని తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. రెండూ భారీ బడ్జెట్ చిత్రాలే..! ‘సాహో’ 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక ‘సైరా’ చిత్రం కూడా 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.