సైరా సినిమా చిత్రీకరణలో విరామానికి కారణం ఏమిటంటే ?
April 18, 2018 / 05:07 AM IST
|Follow Us
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి‘ షూటింగ్ వేగంగా సాగుతోంది. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో మొదటి షెడ్యూల్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కొన్ని రోజుల క్రితం ప్రారంభమయింది. ఈ షెడ్యూల్లో నయనతార, అమితాబ్ బచ్చన్, చిరంజీవిలపై ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో రామ్చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. కొన్ని వ్యక్తిగత పనుల వల్ల చిరంజీవి అమెరికా వెళ్ళవలసి వచ్చింది. అందుకే చిరు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లు టాక్.
అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ మొదలవుతుంది. హైదరాబాద్ లోని ఈ ఫ్యాక్టరీలో కోయిలకుంట్ల ట్రెజరీ సెట్ ను రూపొందిస్తున్నారు. కర్నూలులోని కోయిలకుంట్ల ప్రాంతంలో ఉన్న ట్రెజరీని కొల్లగొట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిషువారిపై తన తిరుగుబాటును ప్రారంభించారు. ఆ ముఖ్యమైన చారిత్రిక ఘట్టం కోసమే ఈ సెట్ ను వేశారు. ఈ షూటింగ్ లో చిరు, విజయ్ సేతుపతి, జగపతిబాబుతో పాటు తమన్నా పాల్గొనబోతున్నట్టు సమాచారం. భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.