జార్జియా షూటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన రామ్ చరణ్

  • September 19, 2018 / 05:48 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగానే కాకుండా సక్సస్ ఫుల్ నిర్మాతగా నిరూపించుకున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో అతను నిర్మించిన ఖైదీ నంబర్ 150 మూవీ భారీ కలక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు మళ్ళీ తన తండ్రి మెగా స్టార్ చిరంజీవి తోనే మరో మూవీ చేస్తున్నారు. ఇది భారీ ప్రాజక్ట్. ఇంత చిన్న వయసులోనే 200 కోట్ల ప్రాజక్ట్ ని హ్యాండిల్ చేయడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా తాను హీరోగా బోయపాటి దర్శకత్వంలో నటిస్తూనే సైరా నరసింహారెడ్డి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ తాజాగా ‘జార్జియా’లో చిత్రీకరణ జరుపుకుంటోంది. గత శనివారం రోజున అక్కడ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. విదేశీ ఆర్టిస్టులపై మూడు రోజులుగా ఓ సన్నివేశాన్నీ చిత్రీకరిస్తున్నారు. రేపటి నుంచి చిరు ఈ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. దాదాపు 20 రోజుల పాటు కొనసాగే ఈ షెడ్యూల్ కోసం 50 కోట్ల వరకూ ఖర్చు చేయనున్నారు.

ఈ సీన్ సినిమాలో హైలెట్ కానుందని చిత్ర బృందం తెలిపింది. అయితే ఈ సన్నివేశాన్ని చిరుతో పాటు, మన తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉత్సహంగా పూర్తి చేయాలనీ నిర్మాత మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి ఆహారంతో ఇబ్బంది పడకూడదని హైదరాబాద్ నుంచి ఆరు మంది చెఫ్స్ ని అక్కడికి తీసుకెళ్లారు. అలాగే వంటలకి కావాల్సిన సామాగ్రిని భారీగా కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, నయనతార తదితరులు నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus