మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంతో అమిత్ త్రివేది అనే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల్ని కర్ణాటక ప్రాంతంలోని బీదర్‌లో… బహుమనీ సుల్తాన్ కోటలో జరపాలని మొదట భావించారు చిత్ర యూనిట్. అయితే కోటలో ముస్లిం ప్రార్థనా స్థలంలో హిందూ దేవతల విగ్రహాలను ఎలా ఏర్పాటు చేస్తారని కొందరు అభ్యంతరం చెప్పడంతో అక్కడ ఉద్రిక్తతత వాతావరణం నెలకొంది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితితిని చక్కదిద్దారు. ఈ క్రమంలో కోటలో హిందూ విగ్రహాలను, చిత్రీకరణకు వేసిన సెట్‌ను తీసేసినట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా… హైదరాబాద్ పరిసర ప్రాంతమయిన కోకాపేటలో స్పెషల్ సెట్ వేసి ఇక్కడ చిత్రీకరణ జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ లో ఉందట. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న… ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఇక ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా… తమన్నా, ప్రగ్యా జైస్వాల్ కీలపాత్రలో నటిస్తున్నారు. అంతేకాద… అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి నటీనటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతుండడం విశేషం.