మెగాస్టార్ టార్గెట్ చాలా ఈజీ.. బ్రేక్ ఈవెన్ కు లక్ష్యం ఎంతంటే..?
September 30, 2019 / 07:51 PM IST
|Follow Us
‘ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి’ జీవిత చరిత్రతో మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా రూపొందిన చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై నిర్మించాడు. ఏకంగా 285 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాడు చరణ్. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ పాటలకి అద్భుతమైన స్పందన లభించింది. ఇక అక్టోబర్ 2 న తెలుగుతో పాటు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి కూడా అదిరిపోయిందనే చెప్పాలి.
‘సైరా నరసింహారెడ్డి’ ఏరియా వైజ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
34 cr
సీడెడ్
21 cr
ఉత్తరాంధ్ర
14.5 cr
ఈస్ట్
10.4 cr
వెస్ట్
9.2 cr
కృష్ణా
9.6 cr
గుంటూరు
11.5 cr
నెల్లూరు
5.2 cr
కర్ణాటక
27 cr
తమిళనాడు
7.6 cr
కేరళ
2.5 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
27.5 cr
ఓవర్సీస్
20 cr
వరల్డ్ వైడ్ టోటల్
200 cr
‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రానికి 285 ఓట్ల భారీ బడ్జెట్ అయ్యింది. ఇక డిజిటల్ మరియు శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ కలిపి 150 కోట్ల వరకూ నిర్మాతలకి వచ్చాయి. ఇక థియేట్రికల్ రైట్స్ ను 200 కోట్ల కు అమ్మారు. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 200 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. దసరా సెలవలు ఉన్నాయి కాబట్టి… అలాగే సినిమాలో మెగాస్టార్ తో అమితాబ్, నయన తార, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది కాబట్టి ఈ టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదనే చెప్పాలి.