Taapsee Pannu: మరో లగ్జరీ కారు కొనుగోలు చేసిన తాప్సి.. ధర ఎంతంటే?

  • September 19, 2023 / 11:13 PM IST

తాప్సి గురించి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఝుమ్మంది నాదం’ సినిమా టైంలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత ‘వస్తాడు నా రాజు’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘వీర’ ‘దరువు’ ‘మొగుడు’ ‘సాహసం’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.. కానీ తర్వాత బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి విమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటించి మెప్పించింది. అక్కడి జనాలు ఈమెకు స్టార్ స్టేటస్ ను కట్టబెట్టారు.

తాప్సితో (Taapsee Pannu) విమెన్ సెంట్రిక్ మూవీ తీస్తే.. దాదాపు రూ.40 కోట్లు వెనకేసుకోవడం ఖాయమని అక్కడి మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అందుకు తగ్గట్టే ఆమె నటించిన చాలా సినిమాలు అక్కడ సూపర్ హిట్ అయ్యాయి. ఈమె పారితోషికం కూడా పెరిగింది. ఇదిలా ఉండగా.. తాజాగా హీరోయిన్ తాప్సీ మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ‘జిఎల్ఎస్ 600’ కారుని కొనుగోలు చేసింది. దీని ధర తెలిస్తే అందరూ షాక్ అవ్వడం ఖాయం. అవును దీని విలువ అక్షరాలా రూ.3 కోట్లు.

అదివారం నాడు ముంబైలో ఉన్న ఆమె నివాసంలో ఈ కారు డెలివరీ అయ్యింది. తాప్సీ గ్యారేజ్ లో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ జీఎల్ , బీఎండబ్ల్యూ 3-సిరీస్,జీప్ కంపాస్, ఆడి ఏ8ఎల్ వంటి కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది 5 వ కారు అని తెలుస్తుంది. ఈ కారు స్పెషలిటీ విషయానికి వస్తే.. 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. అందువల్ల ఎక్స్ట్రా పవర్ అందుకుంటుంది అని తెలుస్తుంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus