పంజాబీ హీరో కోసం హాకీ స్టిక్ పట్టిన తాప్సీ!

  • September 12, 2017 / 08:51 AM IST

కమర్షియల్ సినిమాల్లో నటించబోనంటూనే హిందీలో “జుడ్వా 2″లో బికినీలో మెరిసిన డిల్లీ బ్యూటీ తాప్సీ త్వరలో మరో మీనింగ్ ఫుల్ రోల్ ప్లే చేయనుంది. పంజాబీ కథానాయకుడు దిలిజిత్ జోషి ప్రధాన పాత్రలో ప్రఖ్యాత అర్జునా అవార్డ్ అందుకొన్న సందీప్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రంలో తాప్సీ సదరు సందీప్ సింగ్ ను ఇన్స్పైర్ చేసిన మహిళగా నటించనుంది.

ఆల్రెడీ స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ ఉన్న తాప్సీకి ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం కూడా మొదలెట్టింది. “నామ్ షబానా” సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ మరియు కొన్ని జీమ్నాస్టిక్స్ లో ట్రయినింగ్ తీసుకొన్న తాప్సీకి ఆ సినిమా రిజల్ట్ పెద్దగా ఆనందాన్ని ఇవ్వలేకపోయినా.. ఆ ట్రయినింగ్ మొత్తం ఈ కొత్త సినిమా కోసం ఉపయోగపడుతుండడంతో తాప్సీ కాస్త హ్యాపీ ఫీల్ అవుతుంది. మరి తాప్సీ ఈ సినిమాతోనైనా బాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అవుతుందో లేదో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus