Tamanna: తమన్నా సిన్సియర్ రిక్వెస్ట్.. ఎందుకు ఈ అసహనం!
June 13, 2023 / 05:22 PM IST
|Follow Us
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘శ్రీ’ చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన ఈమె ఆ తర్వాత వచ్చిన హ్యాపీడేస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈమెకు అవకాశాలు భారీగా వచ్చాయి. తెలుగు,తమిళ భాషల్లో ఒక్కసారిగా బిజీ హీరోయిన్ అయిపోయింది. అలా అని ఈమె కెరీర్లో భారీ సక్సెస్ లు అనేవి చాలా తక్కువ. ‘బాహుబలి’ వంటి సినిమాల్లో నటించినా తమన్నాకి చెప్పుకోదగ్గ పేరు రాలేదు.
ఇక ఇప్పుడు తమన్నాకి అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో బాలీవుడ్ వెళ్లి అక్కడ వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. ఆ వెబ్ సిరీస్ లలో తమన్నా గ్లామర్ షో మామూలుగా లేదు. ఇంటిమేట్ సీన్లు కూడా ఓ రేంజ్లో ఉన్నాయని ప్రోమోస్ చెబుతున్నాయి. సో ఇవి కూడా సక్సెస్ కాకపోతే తమన్నా ఇక పెళ్లికి రెడీ అయిపోవాల్సిందే. కానీ ఆమె పెళ్లి ఊసెత్తితే చాలు అసహనం వ్యక్తం చేస్తుంది. విచిత్రం ఏంటంటే బాలీవుడ్లో ఆమె నటించిన రెండు వెబ్ సిరీస్ లు కూడా ‘పెళ్లి’ చుట్టూనే తిరుగుతాయి.
దాంతో, ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు ఇంకా ఎక్కువ ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ‘దయచేసి నా పర్సనల్ విషయాలు కాకుండా వెబ్ సిరీస్ ల గురించి మాత్రమే మాట్లాడండి అంటూ ఘాటుగానే సమాధానమిస్తుంది. ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ సిరీస్ లో విజయ్ వర్మతో ఈమెకు ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువే ఉన్నాయి. ఈ క్రమంలో అతనితో డేటింగ్లో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.