Tamanna: కాలం మారింది.. నేను కూడా మారాలి కదా: తమన్నా
June 17, 2023 / 12:40 PM IST
|Follow Us
మిల్కీ బ్యూటీ తమన్నా 17 ఏళ్లుగా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఆమె పని అయిపోయింది అనుకున్నప్పుడల్లా.. ఓ పెద్ద సినిమాలో కనిపిస్తూ నేనున్నాను అంటూ గుర్తు చేస్తూ ఉంటుంది. కెరీర్ ప్రారంభం నుండి ఈమె చేసినవి గ్లామర్ రోల్సే. బడా హీరోల సరసన నటించిన సినిమాలు అంతంత మాత్రమే ఆడినా.. ఈమెకు మాత్రం ఆఫర్లు తగ్గింది లేదు. దానికి ప్రధాన కారణం చెక్కు చెదరని ఈమె గ్లామర్ అనే చెప్పాలి.
ఎప్పుడైతే ఈమెకు ఆఫర్లు తగ్గాయి అని ఫీలవుతుందో.. అప్పుడు (Tamanna) ఈమె అందాన్ని ఎరగా వేసి ఆఫర్లు చేజిక్కించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వరుసగా సీనియర్ హీరోల సరసన నటిస్తూ వస్తున్నా తమన్నా.. ఇప్పుడు ‘భోళా శంకర్’ లో చిరుకి జోడీగా నటిస్తోంది. మరోపక్క వరుసగా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ వస్తోంది. అయితే వెబ్ సిరీస్ ల విషయంలో ఈమె పంధా మార్చింది. గతంలో ఈమె గ్లామర్ షో చేసినా హద్దులు మీరు ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించింది లేదు.
అయితే ‘జీ కర్దా’ ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ వెబ్ సిరీస్లలో ఈమె హద్దులు మీరు ఇంటిమేట్ సీన్లలో, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించిందట. దీని పై ఆమె స్పందిస్తూ.. ” మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు నేను కూడా మారాను. ఇప్పుడు అందరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముద్దు సన్నివేశాలను, ఇంటిమేట్ సన్నివేశాలను కూడా సృజనాత్మకతలో ఒక భాగంగానే చూడాలి. అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి వెనుకాడకూడదు అని డిసైడ్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది.