Tamanna: తమన్నా ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయా.. పెళ్లి, పిల్లల గురించి అలా చెబుతూ?
June 17, 2023 / 01:10 PM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ఈ మధ్య కాలంలో పెళ్లి, పిల్లలు గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. 30 సంవత్సరాలకే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని అనుకున్నానని తమన్నా కామెంట్లు చేశారు. నేను కెరీర్ ను మొదలుపెట్టిన తొలినాళ్లలో కేవలం 8 నుంచి 10 సంవత్సరాలు మాత్రమే కెరీర్ ను కొనసాగిస్తానని అనుకున్నానని తమన్నా వెల్లడించారు. 30 సంవత్సరాలకే నా కెరీర్ ముగిసిపోతుందని పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటానని నేను భావించానని తమన్నా వెల్లడించారు.
పెళ్లి, పిల్లల తర్వాత ఏం చేయాలా అనేది నేను ఆలోచించలేదని మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చారు. ముప్పై సంవత్సరాల వయస్సు దాటినా ఇప్పుడే పుట్టినట్టు అనిపిస్తోందని తమన్నా అన్నారు. నాకు పునర్జన్మ లభించిందని అనిపిస్తోందని మిల్కీ బ్యూటీ వెల్లడించారు. పెళ్లి అనేది ఎప్పుడు చేసుకోవాలని అనుకుంటే అప్పుడే ఆ దిశగా ఆలోచిస్తానని తమన్నా అన్నారు. పెళ్లి అంటే బాధ్యత అని పార్టీ చేసుకోవడం కాదని తమన్నా కామెంట్లు చేశారు.
ఆ బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టానని మిల్కీ బ్యూటీ పేర్కొన్నారు. పెళ్లి వయస్సు వచ్చిందనో, ఎవరో అన్నారనో పెళ్లి చేసుకోవద్దని తమన్నా చెప్పుకొచ్చారు. తమన్నా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమన్నా ఇప్పటికీ సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి తమన్నా ఇష్టపడుతున్నారు. దాదాపుగా అందరు హీరోలను తమన్నా కవర్ చేశారనే చెప్పాలి.
తమన్నా (Tamanna) రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. తమన్నా కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. బాలయ్య తమన్నా కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్యకు జోడీగా తమన్నా నటిస్తే మాత్రం ఈ జోడీ బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.