Tamanna: బోల్డ్ సన్నివేశాల పై ట్రోలింగ్.. విసిగిపోయిన తమన్నా.. లేటెస్ట్ కామెంట్స్ వైరల్!
June 24, 2023 / 09:32 AM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అభిమానులు మిల్కీ బ్యూటీగా పిలుచుకునే తమన్నా కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ పాత్రలే చేసింది కానీ మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాల్లో, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది లేదు. అయితే ఇప్పుడు తమన్నాని ఎక్కువ సినిమాల్లోకి తీసుకోవడం లేదు. పోటీగా చాలా మంది హీరోయిన్లు వచ్చారు.. ఇదివరకటిలా తమన్నా సినిమాలో ఉండాలి అని ప్రేక్షకులు ఆశించడం కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్లలో నటిస్తుంది.
తమన్నా నటించిన ‘జీ కర్దా’ ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ వంటి వెబ్ సిరీస్ ల కోసం ఆమె తన సిద్ధాంతాలను పక్కన పెట్టినట్లు స్పష్టమవుతుంది. ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు కానీ, ‘జీ ఖర్దా’ వెబ్ సిరీస్ చూసుకుంటే తమన్నా విచ్చల విడిగా బెడ్ రూమ్ సీన్స్ లో నటించింది. ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ వెబ్ సిరీస్ కూడా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇందులో కూడా విజయ్ వర్మతో తమన్నా .. ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించినట్టు స్పష్టమవుతుంది. ఇక ఈ బోల్డ్ సన్నివేశాల గురించి తమన్నాకి కాస్త ఎక్కువగానే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మొదట్లో వాటికి ఓపిగ్గా సమాధానం చెప్పిన తమన్నా.. ఇప్పుడు సహనం కోల్పోయినట్టు స్పష్టమవుతుంది. అందుకు ఆమె లేటెస్ట్ కామెంట్స్ ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఆమె (Tamanna) మాట్లాడుతూ.. ” పాత్ర డిమాండ్ చేయడం వల్లే బోల్డ్ గా నటించడం జరిగింది. గ్లామర్ పాత్రలో నటించడం అనేది కంటెంట్ పై ఆధారపడి ఉంటుంది. ఆ సన్నివేశాలు మీకు నచ్చినా నచ్చకపోయినా… కథలో భాగంగానే వస్తాయి కాబట్టి చూడాల్సిందే” అంటూ కొంచెం ఘాటుగా చెప్పుకొచ్చింది తమన్నా.