Tamannaah Bhatia: ఆ స్కూల్ బుక్ లో పాఠంగా తమన్నా జీవిత చరిత్ర.. అసలేమైందంటే?
June 28, 2024 / 05:48 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో తమన్నా (Tamannaah Bhatia) ఒకరు కాగా తమన్నా ఇప్పటికీ అడపాదడపా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. బాక్ (BAAK) సినిమాతో తమన్నా ఇటీవల మరో యావరేజ్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ తనకు ఏ మాత్రం సంబంధం లేని ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం. ఏడో తరగతి స్కూల్ బుక్ లో తమన్నా పేరుపై ప్రత్యేక పాఠ్యాంశం ఉండగా ఈ పాఠ్యాంశం విషయంలో విద్యార్థుల తల్లీదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
కొంతమంది తల్లీదండ్రులు అయితే ఏకంగా స్థానిక బాలల హక్కుల రక్షణ సంఘంలో ఫిర్యాదు చేయగా ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది. హీరోయిన్ తమన్నా గ్లామర్ రోల్స్ పోషించిన నేపథ్యంలో తన లైఫ్ హిస్టరీని బుక్ లో పాఠంగా పొందుపరచడం సరికాదని విద్యార్థుల తల్లీదండ్రులు చెబుతున్నారు. తమన్నా సింధీకి చెందిన వ్యక్తి కాగా అందువల్ల ఆమె లైఫ్ హిస్టరీని పాఠ్యాంశంగా పెట్టామని స్కూల్ యాజమాన్యం చెబుతున్నట్టు తెలుస్తోంది.
ఆ పాఠ్యాంశాన్ని వ్యతిరేకిస్తే పిల్లలకు టీసీ ఇస్తామని స్కూల్ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోందని విద్యార్థుల తల్లీదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటన గురించి తమన్నా ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కర్ణాటకలోని అసోసియేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఈ ఫిర్యాదు విషయంలో విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. సంబంధిత పాఠశాల అధికారులు ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడటానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.
తమన్నా తనకు ఏ సంబంధం లేని వార్త ద్వారా సోషల్ మీడియాలో వైరల్ కావడం కొసమెరుపు. ఈ వివాదం గురించి తమన్నా నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందేమో చూడాల్సి ఉంది. తమన్నా పారితోషికం ప్రస్తుతం 2.5 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.