సీనియర్ స్టార్ హీరోలలో చాలామందిని హీరోయిన్ల సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా ఎంపికయ్యారని గతంలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ తమన్నాకు అందలేదని తెలుస్తోంది. అడ్వాన్స్ అందకపోవడంతో తమన్నా డేట్స్ ఖాళీగా పెట్టుకోవాలా?
లేక వేరే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా? అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారని తెలుస్తోంది. చిరంజీవి, తమన్నా ఇప్పటికే సైరా నరసింహారెడ్డి సినిమాలో కలిసి నటించారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానున్న నేపథ్యంలో తమన్నాకు అడ్వాన్స్ ఇవ్వలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు తమన్నా చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే సీటీమార్ సినిమాతో తమన్నా ఖాతాలో సక్సెస్ చేరింది. ప్రస్తుతం తమన్నా ది ఘోస్ట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో తమన్నా నటిస్తున్న సినిమాలు విజయాలను సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో ఆమెకు సినిమా ఆఫర్లు మరింత ఎక్కువగా పెరుగుతున్నాయి. సీనియర్ హీరోలకు స్టార్ హీరోయిన్ తమన్నా బెస్ట్ ఆప్షన్ గా నిలవడం గమనార్హం. రెమ్యునరేషన్ విషయంలో భారీ మొత్తంలో డిమాండ్లు చేయకపోవడం కూడా తమన్నాకు ప్లస్ అవుతోందని తెలుస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో తమన్నా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?