తమన్నా మాట నిలబెట్టుకుంటుందా ??

  • November 29, 2016 / 01:42 PM IST

“అభినేత్రి” విడుదల సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా మాట్లాడుతూ.. “నా జీవితంలో నేను చేసిన మొదటి తప్పు ట్రైలింగువల్ సినిమాలో నటించడానికి అంగీకరించడం. ఇక నా జీవితంలో ఎప్పుడూ కనీసం బైలింగువల్ సినిమాలో కూడా నటించను” అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. సరిగ్గా.. “అభినేత్రి” సినిమా విడుదలైన రెండు నెలల్లోపే బాలీవుడ్ సూపర్ హిట్ “క్వీన్”కు రీమేక్ గా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకక్కనున్న ఈ చిత్రం తమిళ రీమేక్ లో తమన్నా కథానాయికగా నటించనుందని నిన్న తమన్నా స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

తమిళ వెర్షన్ కు సీనియర్ నటీమణి రేవతి దర్శకత్వం వహించనుండగా.. తెలుగు వెర్షన్ కు “ఆవకాయ్ బిర్యానీ” ఫేమ్ అనీష్ కురువిల్ల దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. తమిళ వెర్షన్ లో నటించనున్న తమన్నా తెలుగులోనూ నటిస్తుందా లేక తమిళం వరకే పరిమితమంటుందా? అనే విషయంలో క్లారిటీ కావాలి. ఇకపోతే.. ఆల్రెడీ తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న తమన్నా కాక మరెవరితో తెలుగులో నటింపజేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో క్లారిటీ కావాలంటే సినిమా లాంఛనంగా మొదలయ్యేవరకూ ఆగాల్సిందే!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus