సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు ఇక లేరు!

  • December 8, 2022 / 11:00 AM IST

గతకొద్ది రోజులుగా వరుస ప్రమాదాలు, మరణాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పలు కారణాల వల్ల మృతిచెందారు. విశ్వనటుడు కమల్ హాసన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, అల్లు అర్జున్ ‘సరైనోడు’ సింగర్ జుబిన్ నౌటియల్ వంటి వారు ఆసుపత్రిలో చేరారనే వార్తలతో అంతా షాక్ అయ్యారు.. కె.జి.ఎఫ్ తాతగా పాపులర్ అయిన సీనియర్ నటుడు కృష్ణ జి రావు నిన్న (డిసెంబర్ 7) మరణించారనే వార్త మర్చిపోకముందే..

ఇప్పుడు మరో ప్రముఖ నటుడు ఇకలేరనే వార్తతో మరోసారి ఉలిక్కి పడింది చిత్ర పరిశ్రమ.. తమిళ్ యాక్టర్ శివ నారాయణ మూర్తి అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు.. పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శివ నారాయణ.. కోలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్లు వివేక్, వడివేలు తర్వాత ఆ తరహా పాత్రలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి..

ఈ ఇద్దరు హాస్యనటులతోనూ కలిసి నటించిన శివ నారాయణ ఎక్కువగా పోలీస్, విలేజ్ వంట మాస్టర్ క్యారెక్టర్లు వేశారు. దాదాపు 300లకు పైగా సినిమాలు చేశారు.. శివ నారాయణకు భార్య పుష్పవల్లి, కొడుకులు లోకేష్, రామ్ కుమార్, కుమార్తె శ్రీదేవి ఉన్నారు. పట్టుకొట్టైలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయని సమాచారం.. శివ నారాయణ మూర్తి మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేసింది. సినీ ప్రముఖులు శివ నారాయణ మూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నివాళి అర్పిస్తున్నారు..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus