బన్నీతో మరోసారి విలన్ గా..

  • December 25, 2020 / 04:50 PM IST

టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా రూపొందుతున్న పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో గాని రూమర్స్ డోస్ మాత్రం తగ్గేలా లేవు. సినిమా ఎండ్ అయ్యే వరకు కూడా అలానే కొనసాగేలా ఉన్నాయి. ఇక సినిమాలో విలన్ పాత్ర చేయబోయేది ఎవరనే విషయంలో ఎంతో మంది పేర్లు వినిపించాయి. మొదట విజయ్ సేతుపతిని అనుకున్న విషయం తెలిసింద్.

లాక్ డౌన్ దెబ్బకు అంతా ఒక్కసారిగా చేంజ్ అయిపోవడంతో విజయ్ సేతుపతి కొన్ని కమిట్మెంట్స్ కారణంగా చేయలేకపోయాడు. ఇక ఆ తరువాత మరో కోలీవుడ్ హీరో విక్రమ్ పేరు కూడా వినిపించింది. రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా పుష్ప టీమ్ నుంచి మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇక మరొక తమిళ హీరోనే ఫైనల్ చేసినట్లు కొత్త రూమర్ ట్రెండ్ అవుతోంది. అతను మరెవరో కాదు. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ గా మంచి క్రేజ్ అందుకున్న ఆర్య.

ఆర్య హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ నెగిటివ్ రోల్స్ అంటూ బాగానే క్రేజ్ అందుకున్నాడు. ఇక 2010లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన వరుడు సినిమాలో కూడా విలన్ గా నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు. సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆర్య పాత్ర బాగానే క్లిక్కయ్యింది. ఇక ఇప్పుడు పుష్ప కోసం సుకుమార్ మళ్ళీ అతని పేరును చర్చల్లోకి తెచ్చినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమౌతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus