Dil Raju, Nikhil: నిఖిల్ పై ఫైర్ అయిన సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్..!
August 30, 2022 / 10:57 PM IST
|Follow Us
‘కార్తికేయ 2’ చిత్రం రిలీజ్ కు ముందు ‘మా సినిమాని రిలీజ్ చేయనివ్వడం లేదు.. థియేటర్లు ఇవ్వడం లేదు’ అంటూ నిఖిల్ మీడియా ముందుకు వచ్చి ‘ఆ రోజు ఏడ్చేశాను’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘థాంక్యూ’ రిలీజ్ కోసం ‘కార్తికేయ 2’ రిలీజ్ విషయంలో దిల్ రాజు అడ్డుపడుతున్నారు అంటూ ఆ టైంలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్లో దిల్ రాజు మొత్తం మీడియాదే తప్పు అన్నట్లు విమర్శలు చేశాడు. ఆ టైంలో నిఖిల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి విషయాల పై తాజాగా సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఘాటుగా స్పందించి నిఖిల్ ను ఏకిపారేశాడు.
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ” దిల్ రాజు గురించి నిఖిల్ ప్రస్తావించడం తప్పు.. లేనప్పుడు ఏడవాల్సిన అవసరం లేదు. హిట్ పడినప్పుడు ఒక మాట.. ఫ్లాప్ వచ్చినప్పుడు మరో మాట మాట్లాడకూడదు. ముందు ఒక మాట.. వెనుక ఒక మాట ఉండకూడదు.. నీకు ఏదైనా ఉంటే ముందు మాట్లాడు. దిల్ రాజు నీ సినిమాని వాయిదా వేసుకున్నప్పుడు.. ఆరోజు ఎందుకు తిట్టలేదు. నిజంగా నీకు దమ్ము ఉంటే.. దిల్ రాజు సపోర్ట్ చేయడం లేదు అని ఆ రోజు మైక్ లాక్కుని నా కొడకా నువ్వు అట్టా చేయలేదు అని అనొచ్చుగా. దిల్ రాజు ఇంటికి నువ్వు ఎందుకు వెళ్లి అడుక్కున్నావ్..!
ఆయన అది చెప్తున్నాడు. అది అబద్ధమా? నిజమా అని స్టేజ్‌పై ఉన్న నువ్వు చెప్పాలిగా. అసలు నువ్వు ఎవడివి దిల్ రాజు ఇంటికి వెళ్ళడానికి? నీకేం అవసరం? అసలు సినిమా రిలీజ్‌తో హీరోకి పనేంటి? నాకు థియేటర్స్ ఇవ్వడం లేదని నువ్వు ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చావ్.. నీకేం సంబంధం. నువ్వు హీరోవి.. హీరో పనులు హీరో చేసుకోవాలి.. డబ్బులు తీసుకోకుండా నువ్వేం సినిమా చేయలేదు కదా.’మాచర్ల నియోజకవర్గం’ సినిమాకి పోటీగా ‘కార్తికేయ 2’ ను రిలీజ్ చేసే ధైర్యం ఉన్నప్పుడు.. ‘థాంక్యూ’ మూవీకి పోటీగా ఎందుకు రిలీజ్ చేయలేకపోయావు. అంత దమ్ములేదా? ఇలాంటి విషయాలను బయటపెట్టకూడదు. నీ సినిమాపై నీకు నమ్మకం ఉంది కాబట్టి.. తరువాత వచ్చానని చెప్పడంలో తప్పులేదు.
కానీ వాడు దుర్మార్గం చేశాడని అలా చేశాడు ఇలా చేశాడని చెప్పి.. అదే దిల్ రాజుని సక్సెస్ మీట్‌కి పిలిపించి మాట్లాడించావు. దిల్ రాజు.. జరిగింది అంతా చెప్తుంటే.. ఆ వెనుకే ఉన్న నిఖిల్.. మైక్ తీసుకుని అంతా అబద్ధం.. వీడు దుర్మార్గుడు అని చెప్పొచ్చు కదా.. మాట్లాడకుండా ఎందుకు ఉండిపోయాడు. మీ ఇద్దరి మధ్య ఇష్యూని మీడియా ముందు ఎందుకు పెట్టాలి. మీడియాలో చెప్పి అతన్ని అన్ పాపులర్ చేశాడు. ఇప్పుడు లక్కీగా కార్తికేయ2 హిట్ అయ్యింది.. ఒకవేళ పోయి ఉంటే.. మరో లైగర్ అయ్యి ఉంటే ఏం చేసేవాడు. ఈ బ్లేమ్ గేమ్స్ ఆపాలి. సక్సెస్ రాగానే కాలర్ ఎగరేయడం తగ్గించాలి. మీడియా ముందు కూర్చుని కళ్ల నీళ్లు పెట్టుకునే డ్రామాలు ఆపాలి. ఇవన్నీ చాలా అసహ్యంగా ఉంటాయి. ఎవడైనా సినిమాని తీసేది డబ్బులు సంపాదించడానికే.. దేశాన్ని ఉద్దరించడానికి కాదు” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.